బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. మొన్నటివరకు హౌస్ లో ఎంటర్టైన్మెంట్ లేదని గత సీజన్ లతో పోల్చి చూస్తే ఇక ఈ సీజన్ కాస్త ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎంతో చప్పగా సాగిపోతుంది అని కూడా అనిపించింది. కానీ ఇక ప్రస్తుతం టాప్ టెన్ కూడా పూర్తయి కేవలం హౌస్ లో టాప్ 9 మెంబర్స్ మాత్రమే ఉండటంతో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ కాస్త మరింత రసవత్తరంగా మారిపోయింది.. దీంతో మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న వారు సైతం ఇక ఇప్పుడు గేమ్ ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.



అటు ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎక్కువగా టాస్క్ బాగా ఆడుతున్నారు అనే విషయాన్ని గ్రహించి వారికి ఓటు వేసి సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్ లు ఉండగా కెప్టెన్ గా ఉన్న రవి మినహా మిగతా ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఎలిమినేషన్ కోసం నామినేషన్ లో ఉన్నారు. దీంతో నేడు ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళి పోతున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈవారం ఎలిమినేషన్స్ లో ట్విస్ట్ ఉండబోతోంది అనే టాక్ వినిపిస్తోంది.



 అయితే ఇక నేటి ఎపిసోడ్ కి సంబంధించి విడుదలైన బిగ్ బాస్ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో నెటిజన్లు అందరిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇక ఇటీవల విడుదలైన బిగ్ బాస్ ప్రోమో లో భాగంగా.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అటు కాజల్ మానస్ బస్ లోకి ఎక్కుతారు. ఈ క్రమంలోనే ముందుగా సిరి, యానీ ఫోటోలు ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సేవ్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇద్దరి ఫోటోలు కాలిపోతాయి అని కాజల్ మానస్ అలా చేస్తున్నారు అంటూ హౌస్ లో మెంబర్స్ అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తొండి గేమ్ ఆడుతున్నారు పింకీ పై అనీ మాస్టర్ సీరియస్ అవుతుంది. ఇక ఆ తర్వాత సోఫాలో కూర్చున్న పింకీ కోపం వారికేనా మాకు కూడా వస్తుంది అంటూ ఫైర్ అవుతోంది. పక్కనే ఉన్న సన్నీ ప్రియాంకను కూల్ చేయడానికి ప్రయత్నిస్తే చల్ అంటూ అతని చేతిని తోసేస్తూ ఉంది. దీంతో సన్నీ షాక్ అయ్యి చిన్న  స్మైల్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మాస్టర్ సినిమా లోని ఒక పాట పై అదిరిపోయే స్టెప్పులు వేసి అందర్నీ నవ్విస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: