ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో కాస్త హీరోయిన్లు క్రికెటర్ల వెంట పడుతున్నారు అని ప్రచారం మొదలైంది. అగ్రహీరోయిన్ ఎక్కువగా క్రికెటర్లతో ప్రేమాయణం నడపడానికి ఆసక్తి గా ఉన్నారని క్రికెటర్ తో ప్రేమాయణం అడిగితే వాళ్లకు జాతీయ స్థాయిలో ఇమేజ్ వస్తుంది అనే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మన తెలుగులో కూడా ఒకరు ఇద్దరు హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమలో పడ్డారు అనే ప్రచారం కూడా ఈ మధ్య కాలంలో మొదలైంది. ఒక స్టార్ హీరోయిన్ క్రికెటర్ తో ప్రేమలో పడిందని అతని కోసం ఆమె పదేపదే ఢిల్లీ వెళ్లి వస్తుందని కూడా సమాచారం.

క్రికెటర్ విషయంలో ఆమె చాలా సానుకూలంగా ఉండటమే కాకుండా ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో కూడా చెప్పడంతో ఇంట్లో కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని వివాహం చేయడానికి కూడా సిద్ధమయ్యారని అయితే క్రికెటర్ ఇంట్లో మాత్రం హీరోయిన్ కావడంతో వద్దని చెబుతున్నారని సమాచారం. సాంప్రదాయ కుటుంబం కావడంతో కాస్త ఆలోచిస్తున్నారని వాళ్ళ బంధువులు లోనే క్రికెటర్ కు వివాహం చేసే ఆలోచనలో ఉన్నారట. అయితే సదరు హీరోయిన్ మాత్రం అవసరమైతే క్రికెటర్ కోసం సినిమాలు కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వీళ్ళిద్దరూ తరచుగా కలవడమే కాకుండా ఇంట్లో కూడా ఒప్పించే ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారని ప్రచారం మొదలైంది. సదరు హీరోయిన్ ప్రస్తుతం రెండు సినిమాలు తెలుగులో నటిస్తుండగా ఒక సినిమాను కన్నడలో ఒక రెండు సినిమాలను తమిళంలో నటిస్తోంది. ఇక క్రికెటర్  పుట్టిన రోజుకి కారు కానుక ఇచ్చిందని క్రికెటర్ కూడా ఆమెకు ఒక భారీ కానుక ఇచ్చాడని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే వీరిద్దరి ప్రేమ వ్యవహారం మాత్రం మన తెలుగు సినిమా పరిశ్రమలో కాస్త హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: