తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరో లు విభిన్నమైన విభిన్నమైన సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో చెలరేగిపోతున్నారు. ఈ లిస్ట్ లో ఎక్కువగా వినిపించే పేరు నిఖిల్ సిద్ధార్థ్.  హ్యాపీ డేస్ సినిమా తో హీరో గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నిఖిల్ తర్వాత సోలో హీరోగా ఎదిగాడు. వరుసగా విభిన్నమైన సినిమాలు చేస్తూ హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది కుర్ర హీరో నిఖిల్. ఇప్పుడు ఈ కుర్ర హీరో వెంటవెంటనే సినిమాలు చేస్తూ ఆ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు.

ఇప్పుడు నిఖిల్ కార్తికేయ 2, 18 పేజీ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వర్ నటిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్రైటింగ్స్ లో 18 పేజీ అనే సినిమా నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా నిఖిల్ ఒక విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు . అంతేకాకుండా ఈ సినిమా లో నిఖిల్ డబల్ ఆక్షన్  చేస్తున్నారని అంటున్నారు. చందు మొండేటి మరియు నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ మూవీ వచ్చింది. విభిన్న కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2 అనే సినిమాని చేస్తున్నారు. ఇప్పుడు మరొక సారి అదే విధమ విభిన్నకథా నేపథ్యంలో లో చందు మొండేటి దానికి సీక్వెల్గా నిర్మిస్తున్నారు. అలాగే మరో సినిమా కూడా నకిలీ ఖాతాలో ఉంది. ఈ సినిమాకు గూడచారి, ఎవరు వంటి హిట్ సినిమాలకు ఎడిటర్గా పనిచేసిన గ్యారీ బి హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్ సినిమా పతాకంపై కే రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవే కాక నిఖిల్ ఇంకో రెండు సినిమాల్లో కూడా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ రెండు షూటింగ్ పనులు పూర్తయిన తర్వాత ఈ సినిమాలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: