ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో చాలా వరకు ఏపీలో బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తుంది. 'పెళ్ళి సందడి' వంటి చిన్న సినిమా 'డాక్టర్ వరుణ్' 'కురుప్' వంటి డబ్బింగ్ సినిమాలని పక్కన పెట్టి నట్లాయితే .

'లవ్ స్టోరీ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి హిట్ సినిమాలు కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తుంది.. దీంతో పెద్ద సినిమాల భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నర్ధకంగా మారిందని సమాచారం. బాలయ్య 'అఖండ' సినిమా ఫలితాన్ని బట్టి.. ఓ అంచనా వేయొచ్చని తెలుస్తుంది.ఆ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50 కోట్ల పైనే షేర్ ను రాబట్టాలని తెలుస్తుంది 

ఈ విషయం పక్కన పెడితే.. ఏపి ప్రభుత్వం సినీ పరిశ్రమ పై కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ వల్లనే అని ఆయన బాగా బాధపడుతున్నట్టు స్పష్టమవుతున్నట్లు సమాచారం. అందుకోసమే అతను చేయబోయే తర్వాతి సినిమాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాదట పవన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రం విషయంలో కీలక మార్పులు పవన్ సూచించాడని తెలుస్తుంది. ఆ సినిమాలో ఎటువంటి పొలిటికల్ పార్టీల సెటైర్లు లేకుండా చేయమని చెప్పుకొచ్చాడట.

 

సామజిక అంశాలు మిళితమై ఉన్నా పర్వాలేదు కానీ.. రాజకీయాల జోలికి పోవద్దని పవన్ సూచించాడని తెలుస్తుంది.దాంతో స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేయడానికి దర్శకుడు హరీష్ శంకర్ రెడీ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్టు నిర్మాతలు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే… మరి చూడాలి ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా తన పంథాను మార్చుకుంటుందో లేదో. సినీ పరిశ్రమకోసం తాను ఏమి చేయడానికి అయిన సిద్ధంగా ఉన్నట్లు పవన్ తెలిపాడని సమాచారంమరి చూడాలి పవన్ భాధ ఏపీ ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: