తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షో గురించి మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయ్యినప్పటి నుండి అందరు మానస్ ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఆయన ఆట తీరు..ఎదైన గొడవ జరిగినప్పుడు ఆయన తీసుకునే స్టాండ్..మాట్లాడే మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆట పరంగా కూడా ఎక్కడ తగ్గకుండా..రోజు రోజుకి తన లెవల్ ను పెంచుకుంటూనే పోయారు. కానీ, ఏమైందో ఏమో తెలియదు కానీ గత రెండు వారాలుగా..మానస్ లో చాలా మార్పులు వచ్చాయి అంటున్నారు అభిమానులు.

ముఖ్యంగా పింకీ విషయంలో మానస్ ఎందుకో ఎక్కువ చిరాకు పడుతున్నట్లు మనం టీవీ చూస్తున్నపుడు అనిపిస్తుంది. ప్రతి దానికి అవసరం ఉన్నా లేకున్నా పింకీ పై అరిచేసి..మళ్ళీ వెళ్లి హగ్ లు చేసుకోవడం చాలా ఓవర్ గా అనిపిస్తుంది. నిజానికి మానస్ క్యారెక్టర్ అది కాదు. తప్పు చేయకుండా అరవడు. ఒక్క మాట అనే ముందు ఒకటికి ఐదు సార్లు ఆలోచిస్తారు. కానీ రెండు వారాలుగా మానస్ బిహేవియర్ లో కూడా మార్పులు వచ్చాయి.

ఈ క్రమంలో ఆయన ఓటింగ్ శాతం కూడా తగ్గిన్నట్లు తెలుస్తుంది. ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్న..ఖచ్చితంగా మొదట మూడు  స్దానాలో హై ఓటింగ్ తో సేవ్ అవుతూ వచ్చాడు. కానీ ఈసారి పరిస్ధితి అందుకు భిన్నంగా ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఆయన డౌన్ నుండి సెకండ్ ప్లేస్ లో ఉన్నారట. హౌస్ కెప్టెన్ గా ఉన్నప్పటికి..ఈ వారం ఎలిమినేషన్ నుండి సేవ్ అయినా కూడా..మానస్ ముందు గ్రాఫ్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అంటున్నారు నెటిజన్స్. ఇలానే ఆయన గ్రాఫ్ పడిపోతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యి ఇంటి నుండి బయటకు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. మరి చూడాలి మానస్ ఏం చేస్తాడొ..?

మరింత సమాచారం తెలుసుకోండి: