ఆమె ఉప్పెనలా దూసుకువచ్చింది. అచ్చె తెలుగు అందంలా పరిమళించింది. సహజసిద్ధమైన సొగసులను అద్దుకుని కుర్రకారు గుండెలను లాక్ చేసి పారేసింది. ఆమె ఎవరో కాదు ఉప్పెన మూవీ సుందరి కృతి శెట్టి.

ఆ మూవీతో కృతి తెలుగు వారికి హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. సన్నగా నవ్వుతూ తళుకు బెళుకులతో సోయగాల సెగలు రగిలిస్తూ కృతి శెట్టి అచ్చమైన తెలుగు కధానాయిక అంటే తానేనని కూడా రుజువు చేసుకుంది. ఉప్పెన సినిమా రిలీజ్ కాకుండానే చాలా అవకాశాలను ఆమె పట్టేసింది.

ఇక అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలసి నటిస్తున్న బంగార్రాజు మూవీలో చైతూకి జోడీ కట్టి నాగలక్ష్మిగా మెరుస్తోంది కృతి. ఈ మూవీలో ఆమె గ్రామీణ యువతికి రెట్టింపు అందంతో యూత్ గుండెల్లో మంటలను పెట్టడం ఖాయం. ఇదిలా ఉంటే ఉప్పెన మూవీలో స్టోరీ ఎలా ఉన్నా పూర్తి ఫోకస్ అయింది మాత్రం కృతి శెట్టినే. మళ్లీ అలాంటి మూవీ వస్తుందా అని ఎదురుచూస్తున్న వేళ మెగా డాటర్ సుస్మిత తన సొంత బ్యానర్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీ కోసం కృతిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసింది అని తెలుస్తోంది.

ఈ వార్తలు నిజమైతే కృతికి బంపర్ ఆఫర్ వచ్చి ఒడిలో పడినట్లే. ఈ మూవీతో కృతి మరో మెట్టు ఎక్కడం కూడా ఖాయమే అంటున్నారు. ఇక హీరో రామ్ పోతినేని  మూవీలో కూడా కృతి నటిస్తోంది. ఇలా వచ్చిన చాన్సులను చక్కగా వినియోగించుకుంటూ కృతి దూసుకుపోతోంది. చేస్తున్న సినిమాలు హిట్ అయితే మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా టాప్ చెయిర్ లోకి కృతి దూసుకురావడం ఖాయమనే అంటున్నారు. చూడాలి మరి ఈ సొగసరి సిరి ఎలా ఉందో.  ఏది ఏమైనా ఒకవైపు టాలీవుడ్ అందగత్తెల కోసం ఆశగా  ఎదురుచూస్తున్న వేళ  కరెక్ట్ టైమ్ లో  కృతి వచ్చింది అంటున్నారు. ఈ ముద్దు గుమ్మ సరైన సబ్జెక్టులతో ముందుకు వస్తే కచ్చితంగా తెలుగులో పాతుకుపోవడం ఖాయమనే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: