అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. డిసెంబర్ 17వ తేదీన క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ సినిమాపై మెగా అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అల వైకుంఠపురం లో సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవ్వాలని యూనిట్ భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే యూనిట్ కూడా బాగానే ఈ సినిమా కోసం కష్టపడుతుంది అని చెప్పవచ్చు.

రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా ఈ చిత్రం కూడా రంగస్థలం సినిమా లాగానే వెరైటీగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్ లు వస్తున్నప్పటి నుంచి ఈ సినిమా ఫీల్ కొంత రంగస్థలం లాగా ఉందని అందుకే ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చెబుతున్నారు. దాంతో ఈ సినిమాను రంగస్థలం తో పోల్చడం మొదలుపెట్టారు కొంతమంది అభిమానులు.

అయితే ఈ విధంగా పోల్చడం వల్ల పుష్ప సినిమాకు నష్టమే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్ సినిమాగా రంగస్థలం నిలిచిపోగా అందులో హీరోగా నటించిన రామ్ చరణ్ ఈ చిత్రంతో నటుడిగా తనను తాను చాలా నిరూపించుకున్నాడని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన కంటే సీనియర్ హీరో అయిన అల్లు అర్జున్ రామ్ చరణ్ నటన తో పోల్చి ఆయనను అవమాన పరచడమే కాకుండా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లలో అల్లు అర్జున్ నటించిన తీరు చూసి చరణ్ కంటే ఎక్కువగా నటించలేదని చెడ్డ పేరు కూడా మోస్తున్నాడు. ఈ విధంగా అల్లు అర్జున్ విమర్శల పాలు అవుతుండగా ఈ సినిమాతో ఆయన చరణ్ ను మించే విధంగా నటించిన లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: