తెలుగు సినిమా పరిశ్రమలో నవరస నటసార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ. 88 సంవత్సరాల ఈ మహా నటుడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తుంది..

గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కండీషన్ ప్రస్తుతం మరింత సీరియస్ అయ్యిందని తెలుస్తుంది.. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం.. ఈ నేపథ్యంలో పలువురు సినీ దిగ్గజాలు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారని తెలుస్తుంది.. అయితే సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు కొనసాగిన ఆయన సినీ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో విలక్షణ నటుడు అయిన సత్యనారాయణ గారు మహానటుడు ఎస్వీ రంగారావు నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన తన చక్కటి నటనతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నాడని సమాచారం.. దాదారు ఆరుదశాబ్దాల పాటు సినీ పరిశ్రమను ఏలాడని 777 సినిమాల్లో నటించి తెలుగు సినీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాడని తెలుస్తుంది.పౌరాణిక, జానపద అలాగే చారిత్రక, సాంఘిక చిత్రాల్లో నటించి తన సత్తా చాటుకున్నాడని 1935 జూలై 25న ఏపీలోని కృష్ణ జిల్లా బంటుమిల్లిలో ఆయన జన్మించాడని సమాచారం.. 1958లో వచ్చిన సిపాయి కూతురు సినిమాతో తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టాడట.తొలుత ఆయన ఎన్టీఆర్ డూప్ గా నటించాడని తెలుస్తుంది.

ఆ తర్వాత ఎన్టీఆర్ చొరవతో ఆయనకు ప్రత్యేక పాత్రలు వచ్చాయని దర్శకుడు విఠలాచార్య సత్యనారాయణ నటనాశక్తిని తొలుత గుర్తించాడని తెలుస్తుంది.. ఆ తర్వాత శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, నర్తనశాల, శ్రీకృష్ణపాండవీయం అలాగే దాన వీర శూర కర్ణ, కురుక్షేత్రం, సీతా కళ్యాణం, శ్రీరామపట్టాభిషేకం సహా పలు పౌరాణిక సినిమాల్లో నటించి అదుర్స్ అనిపించాడని తెలుస్తుంది.. యమగోల, యముడికి మొగుడు, యమలీల సహా పలు సినిమాల్లో యముడిగా నటించి అదరగొట్టాడని సమాచారం.సుమారు నాలుగు తరాల నటులతో ఆయన కలిసి నటించాడట. 1996లో ఎన్టీఆర్ ఒత్తిడి మేరకు మచిలీపట్నం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడని సమాచారం.. ఆ తర్వాత 2011లో ఆంధ్రా సర్కారు ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించిందట.కొంత కాలంగా ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తుంది.చివరగా కార్తిక్ రాజు, మిస్తి చక్రవర్తి హీరో మరియు హీరోయిన్లుగా తెరకెక్కిన ధీర్ఘాయుష్మాన్ భవ చిత్రంలో సత్యనారాయణ నటించారని తెలుస్తుంది.. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసారని తెలుస్తుంది.. త్వరలో ఈ సినిమా విడుదల కానుందట ఆలోగా ఆయన ఆరోగ్యంగా హాస్పిటల్ నుంచి బయటకు రావాలని జనాలు కోరుకుంటున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: