టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా విజయాలతో దూసుకుపోతూ హీరోగా మరింత భారీ క్రేజ్ సొంతం చేసుకుంటూ కొనసాగుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఇటీవల ఆయన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ఆయన హ్యాట్రిక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ తీస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా జరుపుకుంటూ ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందా మది ఫోటోగ్రఫి ని అందిస్తున్నారు.

థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ ని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరిలో సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసాయి. నిజానికి ఈ సినిమాని రాబోయే జనవరి 13న విడుదల చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటించిన యూనిట్, ఇటీవల మూవీ ని ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దానితో మొన్నటి దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందని భావించిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది.

అయితే అప్పటి నుండి ఫస్ట్ సాంగ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే అని, సంక్రాతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మహేష్ ఫ్యాన్స్ మరొక రెండు నెలల వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు.    

మరింత సమాచారం తెలుసుకోండి: