యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వీడియోను రిలీజ్ చేసి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి చేసిన కామెంట్లపై స్పందించిన విషయం అందరికి తెలిసిందే.

ఈ ఘటన తన మనస్సును కలచివేసిందని రాజకీయాలలో వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారకూడదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారని సమాచారం. మాట అనేది వ్యక్తిత్వానికి ప్రమాణమని ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన తన మనస్సును కలచివేసిందని ఎన్టీఆర్ అన్నట్లు సమాచారం.

ఎప్పుడైతే ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో పరుష పదజాలంతో ఆడపడుచుల గురించి మాట్లాడుతున్నామో అదొక అరాచక పాలనకు నాంది అవుతుందని ఎన్టీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తుంది.స్త్రీ జాతిని గౌరవించడం మన సంస్కృతి అని ఈ సాంప్రదాయం రక్తంలో అలాగే నవనాడులలో ఇమిడిపోయిన సాంప్రదాయం అని కుటుంబ సభ్యుడిగా తాను ఈ విషయాలను చెప్పడం లేదని సాటి తెలుగువాడిగా చెబుతున్నానని ఎన్టీఆర్ అన్నట్లు సమాచారం.

అయితే ఎన్టీఆర్ స్పందించిన తీరు గురించి ఒక అభిమాని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారని తెలుస్తుంది.. చంద్రబాబు ఫ్యామిలీ గురించి అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని అభిమాని చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఈ ఘటన గురించి స్పందించకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిమాని కామెంట్లు చేసినట్లు తెలుస్తుంది.కర్ర విరగదు పాము చావదు అనే విధంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఉందని ఫ్యాన్ కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం..

ఎన్టీఆర్ అంటే వైబ్రేషన్ అని ఎన్టీఆర్ వీడియోలో చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడారని అభిమాని అన్నారని తెలుస్తుంది.. ఎన్టీఆర్ పేరుపై పేరు ప్రతిష్టలు సంపాదించిన జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన విధానం వల్ల ఆయనపై గౌరవం పోయిందని ఎన్టీఆర్ అభిమాని తెలిపినట్లు తెలుస్తుంది.అభిమాని చేసిన కామెంట్ల గురించి ఎన్టీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి మరి. ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారనే విషయం  అందరికి తెలిసిందే. త్వరలో తారక్ స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు తిరిగి రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: