మెగా పవర్ స్టార్ రామ్ చరణ మరియు స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో ఓ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి అందరూ ముందుగా మాట్లాడుకుంది ఏమిటంటే ఈ సినిమాలో చరణ్ లుక్ ఎలా ఉండబోతోంది అని..శంకర్ ఎలా చూపించబోతున్నారు అని .
అందుకు కారణం శంకర్ సినిమాలలో హీరోలు తప్పకుండా ఓ డిఫరెంట్ మేకోవర్‌లో నటిస్తున్నారట చరణ్.ఇది చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.


ఇది చరణ్ మైల్‌స్టోన్ మూవీఅని అంతేకాదు నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థకు కూడా ఈ సినిమా మైల్ స్టోన్ మూవీ అని తెలుస్తుంది.ఆ సంస్థ నుంచి వస్తున్న 50వ సినిమా కావడం మంచి శుభ పరిణామం అని తెలుస్తుంది.అందుకే ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట.ఈ పాన్ ఇండియన్ సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేసి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారని తెలుస్తుంది.. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూణెలో పూర్తి చేశారట.ఈ షెడ్యూల్‌లో ‘కేజీయఫ్’ స్టంట్ మాస్టర్స్ అయిన అనుబ్ మరియు అరివ్ ఆధ్వర్యంలో చరణ్ పాల్గొనగా ఓ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తుంది.

ఈ క్రమంలో తాజాగా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయిందని తెలుస్తుంది.. ఈ షెడ్యూల్‌లో చరణ్ – కియరాలపై శంకర్ ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నారని సమాచారం.. శంకర్ సినిమాలలో సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే.
ఒక్క సాంగ్ కోసమే భారీ బడ్జెట్ తో సెట్స్ నిర్మాణం చేస్తున్నారట..గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కిస్తుంటారని సమాచారం.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సాంగ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని సమాచారం.అంతేకాదు చరణ్‌ను ఈ సాంగ్‌లో సూపర్ ఫ్యాన్సీ లుక్‌లో కనిపించనున్నట్టు వార్త వినిపిస్తుంది.ఇక ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్నారని తెలుస్తుంది.. థమన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్న విషయం అందరికి తెలిసిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: