తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ లో సగానికి సగం మంది పక్క భాష సుందరిమణులే. పక్క రాష్ట్రం నుండి వచ్చి మన ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఇక ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి..ఇండస్ట్రీలో పలు భాషలలో అద్భుతమైన చిత్రాల్లో కూడా నటిస్తూ.. స్టార్ హీరోయిన్లుగా ఎదిగిపోయారు. అలా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అందగత్తెలు ఎవరో తెలుసుకుందాం..!!

నయనతార: మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న ఈ అందాల తార నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాప్ హీరోలకు ధీటుగా తన పారితోషకాని తీసుకుంటుంది. అంతేకాదు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో చెల్లెలుగా నటించడానికి ఏకంగా 6 కోట్ల రుపాయలను డిమాండ్ చేస్తుందట. ఇక ఈ అమ్మడు ఒక్కో సినిమా 4-5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటుంది.

పూజా హెగ్డే : టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రేత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ బుట్టబోమ్మ.. ఒక్కప్పుడు ఒక్కటి అంటే ఒక్క హిట్ కోసం ఎన్నో కష్టాలు పడింది. చివరకు ఎలాగోలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. ఇప్పుడు దర్శక నిర్మాతల పాలిట అదృష్ట  దేవతగా మారిపోయింది. ఈ భామ ఒక్కో సినిమాకి 3-4కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్.

సమంత: టాలీవుడ్ కుందనప్పు బొమ్మ సమంత  స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత ఒక్కో సినిమాకు రెండున్నర నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషకం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

రష్మిక మందన : ఈ అమ్మడు ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన చాలా తక్కువ కాలంలోనే క్రేజీ ఆఫర్స్ అందుకున్న హీరోయిన్ గా రికార్డ్ బద్దలు కొట్టింది. ఇక ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు మూడు కోట్ల పారితోషం తీసుకుంటుందట.

కీర్తి సురేష్: టాలీవుడ్ కి దొరికన ఒక మహానటి. కళ్లతోనే అన్ని భాషలు పలికించగల ఓ అందాల బొమ్మ. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు..కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు చెల్లెలి పాత్రలో నటిస్తూ బిజీ బిజీ గా ఉంది. కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు 3 కోట్లు కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: