నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ రైతు  గా ఘోర గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరిగేలా చేస్తాయి, ఇప్పటికే ఈ సినిమా పనులు అన్ని పూర్తి అవడంతో ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్రబృందం అఫీషియల్ గా తెలియజేసింది. ఇదిలా ఉంటే తాజా గా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి అయ్యింది.

సెన్సార్ బోర్డు అఖండ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే తాజా గా ఈ విషయాన్ని ఈ సినిమాలో హీరోయిన్ అయిన ప్రగ్యా జైస్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రగ్యా జైస్వాల్ ఒక సినిమా పోస్టర్ ను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రగ్యా జైస్వాల్ పోస్ట్ చేసిన ఫోటోలో బాలకృష్ణ మరియు ప్రగ్యా  జైస్వాల్ ఇద్దరు ఒక జిపై కూర్చుని ఉన్నారు. మరియు  ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో 45 నిమిషాల వర కు ఫైట్ సీన్స్ ఉంటాయి అని తెలుస్తుంది. ఈ ఫైట్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ని భారీ ఎత్తు గా చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: