నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో ముద్దు గుమ్మలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణా హీరోయిన్ లుగా నటించారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ రైతు గా, అగోరా గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలను చిత్ర బృందం విడుదల చేయక వీటికి  జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడం తో అఖండ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను భారీ ఎత్తు గా నిర్వహించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజా గా అఖండ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
తమన్నా మాట్లాడుతూ.. బాలకృష్ణ చాలా స్వీటెస్ట్ పర్సన్.. బాలకృష్ణ ఏది చెప్తే అది బోయపాటి చేస్తూ ఉంటారు, బోయపాటి  ఏది చెబితే దానిని బాలకృష్ణ  చేస్తూ ఉంటారు. తమన్నా మాట్లాడుతూ.. నేను రెండున్నర నెలల పాటు అఖండ ట్రాన్స్ లోనే ఉన్నాను. ఎందుకు అని యాంకర్ ప్రశ్నించగా.. నాకు అఖండ సినిమా అంత బాగా నచ్చేసింది అంటూ తమన్ సమాధానం ఇచ్చాడు. అఖండ సినిమా లో ఆర్ ఆర్ కూడా అద్భుతంగా వచ్చింది అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. అఖండ సినిమా అదిరిపోయేలా వచ్చింది అని, ఫ్యామిలీస్ మరియు మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా అదిరిపోయేలా నచ్చుతుంది అని తమన్ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాను స్టూడియోలో చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు తమన్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: