మెగా కాంపౌండ్ లో కనీసంగా డజన్ కి దగ్గరగా హీరోలు ఉన్నారు. వారంతా కూడా ఎవరి టాలెంట్ వారు చూపిస్తున్నారు. అయితే దాదాపు సేమ్ ఏజ్ తో పాటు సేమ్ ఇమేజ్ ని కలిగిన హీరోలు ఇద్దరు ఉన్నారు. వారి మధ్య ఎపుడూ తెలియని పోటీ ఏదో అలా సాగుతూనే ఉంటుంది.

ఇది ఆరోగ్యకరమైన పోటీగా చూడాలి. ఆ ఇద్దరిలో ఒకరు అల్లు అర్జున్ అయితే రెండవ వారు రామ్ చరణ్. ఈ ఇద్దరిలో అర్జున్ ముందుగా ఇండస్ట్రీకి వచ్చాడు. అనేక హిట్లు కొట్టాడు. ఆ తరువాత చరణ్ వచ్చినా కూడా తన సత్తాను రెండవ సినిమా మగధీరతో లోకానికి చాటాడు. ఇక ఈ ఇద్దరికీ టాలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ఇద్దరూ కూడా ఇపుడూ బాలీవుడ్ లో కూడా తన జెండా ఎగరేయాలని చూస్తున్నారు.

అందుకే కూడబలుక్కునట్లుగా ఒకే సమయంలో పాన్ ఇండియా మూవీస్ ని ఇద్దరూ చేశారు. ట్రిపుల్ ఆర్ పేరిట రామ్ చరణ్ 2022 జనవరికి వస్తూంటే అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో డిసెంబర్ లో పుష్ప మూవీ ద్వారా వస్తున్నాడు. ఈ మూవీతో బన్నీ బాలీవుడ్ ని కాస్తా గట్టిగానే  టచ్ చేస్తున్నాడు. కచ్చితంగా తనకు పాన్ ఇండియా అప్పీల్ ఉంటుందని కూడా నమ్ముతున్నాడు. బన్నీ మూవీ ముందు వస్తోంది. మెగా కాంపౌండ్ హీరోలలో అలా బన్నీ తానే ఫస్ట్ అని  చెప్పేస్తున్నాడు అన్న మాట.

మరో వైపు ఈ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ కి రీచ్ అవుతుందని, అందరికీ నచ్చుతుందని కూడా అంటున్నారు. సుకుమార్ ఇలాంటి సబ్జక్టులను  డీల్ చేసే విధానం కూడా బాగుంటుంది, ఇక సాంగ్స్ కానీ, బన్నీ యాక్షన్ కానీ హైలెట్ అంటున్నారు. హీరోయిన్ రష్మిక అయితే సినిమాకు మరో అసెట్ అంటున్నారు. సో కచ్చితంగా పుష్ప తో బన్నీ పాన్ ఇండియా హీరో అని ఫ్యాన్స్ అయితే ముందే చెప్పేస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ తో  బాలీవుడ్ లో సత్తా చాటడం ఖాయం. సో మెగా కాంపౌండ్ లో ఇద్దరు టాప్ హీరోలు ఇలా జాతీయ స్థాయిలో టాలెంట్ చాటడం అంటే చిన్న విషయం మాత్రం కాదు అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: