ఏడు వందలకు పైగా సినిమాలలో నటించిన కైకాల సత్య నారాయణ రావు ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి అద్భుతమైన విలనిజాన్ని పండించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన తనదైన ముద్రను ప్రదర్శించారు. ఒక్క పాత్ర అనే కాకుండా అన్ని రకాల పాత్రలను పోషించి ఆకట్టుకున్నారు. పాత్ర ఏదైనా అందులో కైకాల సత్యనారాయణ రావు జీవించేవాడు. సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలలో నటించి గొప్ప గొప్ప నటుల జాబితాలో చేరిపోయారు. చారిత్రాత్మక సినిమాల్లో సైతం ఆయన మంచి పాత్రలు పోషించారు.

కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన చదువుకునే రోజుల్లోనే కొన్ని నాటకాలలో నటించి సినిమాల లోకి రావడానికి ఆసక్తి చూపించే వారు.  అలా డిగ్రీ పూర్తయిన తర్వాత ఆయన మనసు నటన పైకి వెళ్లడంతో ఓ మిత్రుడు సహాయం తో ఆయన చెన్నై కి చేరుకున్నారు. అలా సినిమా అవకాశాల కోసం వెతికి చివరికి సిపాయి కూతురు అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. అయితే ఆయనకు ఆ చిత్రం ప్లాప్ ఇవడంతో ఎంతో నిరాశ చెందారు. అయినా ఆయన కూడా కృంగిపోకుండా అక్కడే ఉండి ప్రేక్షకులను అలరించే సినిమాల్లో నటించారు. 

ఎన్నో సినిమాల్లో నటించిన తర్వాత ఆయనకు ఎన్టీఆర్ దృష్టిలో పడే అవకాశం వచ్చింది. అలా మొదట్లో ఎన్టీఆర్ కు డూప్ గా చేసిన ఆయన చాలా సినిమాలలో నటించి ఎన్టీఆర్ మెప్పును పొందాడు. ఆ తర్వాత ఆయన తీసే చాలా సినిమాల్లో సత్యనారాయణకు కీలక పాత్రలు ఇస్తూ వచ్చారు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత రోజుల్లో ఆయన బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. రామారావు కు డూప్ గా కాకుండా దాదాపు వంద చిత్రాల్లో సహ నటుడు గా నటించాడు. ఆనాటి మేటి హీరోల చిత్రాలలో ప్రతి నాయకుడిగా నటించిన సత్యనారాయణ అందరినీ మెప్పించారు. రామారావు పోలికలతో ఉన్నాడు అని అప్పట్లో అభివర్ణించేవారు ఆయనను. శ్రీకృష్ణ అవతారం సినిమాలో దుర్యోధనుడి గా నటించిన ఆయన ఎన్టీఆర్ ను మించే నటనను కనబరిచి తన కెరియర్ గ్రాఫ్ ను పెంచుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: