కే జి ఎఫ్ సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి పేరు ప్రఖ్యాతలను సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఎంతటి స్థాయిలో సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కన్నడ నాట స్టార్ హీరోగా ఉన్న యశ్ ఈ చిత్రం లో హీరోగా నటించగా రికార్డుల మీద రికార్డులు సృష్టించి భారీ కలెక్షన్లను సాధించింది ఈ సినిమా. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా కైకాల సత్యనారాయణ కు ఈ సినిమాకు ఉన్న సంబంధం ఏమిటో అర్థంకాక అప్పట్లో చాలామంది ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యారు. 

తెలుగులో మంచి నటుడిగా ఉన్న కైకాల సత్యనారాయణకు కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధం ఏమిటని చాలా మంది తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే కే జి ఎఫ్ సినిమా విడుదలైనప్పుడు అందరికంటే ముందుగా కైకాల సత్యనారాయణ సమర్పించు అనే పేరు పడుతుంది. దానికి కారణం తెలుగులో ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి తో కలిసి విజయ్ కిరంగదర్ తో పాటు కైకాల సత్యనారాయణ సమర్పించు అనే టైటిల్ వేశారు. ఒకప్పుడు రమ ఫిల్మ్స్ పేరుతో ఆయన సినిమాలను నిర్మించే వారు. 

ఆయన వారసుడు కూడా నటుడిగా కాకుండా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. అందుకే కేజీఎఫ్ చిత్ర సమర్పకుడు గా కైకాల పేరు పడటం వెనుక అసలు కారణం ఇదే. ఆయన వారసుడు కన్నడ నిర్మాణ రంగం లో నిర్మాత గా ఉన్నాడు. ఈ సినిమా రేంజ్ ముందుగానే ఊహించిన కాల తనయుడు తెలుగులో ఈ చిత్రం రైట్స్ కోసం పోటీ పడ్డాడు అలాగే అగ్ర నిర్మాత అయిన సాయికొర్రపాటి లాంటి నిర్మాత ఉంటే అండగా ఉంటే మంచిదని భావించి ఆయన తో కలిసి విడుదల చేశాడు. అందుకే ఈ సినిమాకు సత్యనారాయణ సమర్పణ అని పడుతుంది. ఆ తర్వాత ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్లు సాధించింది. ఆ సమయంలో కైకాల సత్యనారాయణ కోసం సన్మానం కూడా చేసింది చిత్రయూనిట్. మరి రెండవ భాగానికి ఆయన పేరు పడుతుందా అనేది వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: