టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కొన్ని హిట్ అవుతాయి కొన్ని ప్లాప్ అవుతాయి. చాలా సినిమాలు ప్రేక్షకుల మనసులో ఒక తీపి జ్ఞాపకాలను కలిగించడంలో సక్సెస్ అయ్యాయి. వాటిలో ఒకటి "Rx 100" చిత్రం ఒక సంచలనమే చెప్పాలి. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ కాసుల వర్షం కురిపించింది. అంచనాలు పెద్దగా లేకపోయినప్పటికీ విడుదల అనంతరం తన సత్తా చాటి  ఆడియన్స్ ను థియేటర్ల వద్ద క్యూ కట్టేలా చేసింది. ఈ మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదాని అందుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో అందాల ఆరబోతలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా గ్లామర్ ను వడ్డించేసింది ఈ అందాల తార.  

ఒక్క సినిమాతో యువతను కట్టిపడేసిన ఈ చిన్నది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా తరువాత ఆమెకు ఆఫర్లు బాగానే వచ్చాయి. దాంతో అమ్మడు హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయింది.  ఇక రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అభిమానులకు ఆమె ప్రేమికుడి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె ప్రియుడు సౌరభ్ థింగ్రా గురించి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంటాయి. ఆ మధ్య వీరి రొమాంటిక్ వీడియో కానీ సోషల్ మీడియాతో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.  దాదాపు పాయల్ తో పాటు షూటింగ్స్ కి కూడా వెళుతుంటారు సౌరబ్. ఇద్దరు కలసి రావడం కలిసి వెళ్లడం ఒకే రూమ్ లో ఉండటం వంటివి జరుగుతుంటాయి. ఇదిలా ఉండగా సౌరబ్ ని ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

తాజాగా వీరిద్దరూ త్రీ రోజెస్ లో కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు సౌరభ్ ను హీరోగా, తనను హీరోయిన్ గా  సినిమా వెండి తెరపై చూడాలని ఆశపడుతున్నారు పాయల్. తనకు కథ చెప్పిన ఓ స్టార్ డైరెక్టర్ ని ఆ సినిమాలో హీరోగా సౌరభ్ ని తీసుకోండి అని పాయల్ అడిగినట్లు తెలుస్తోంది. తనని హీరోగా తీసుకుంటే ఆ సినిమాకి పారితోషికం కూడా తనకు వద్దని అన్నారట పాయల్. అయితే ఈ వార్తపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: