ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల టీజర్స్, అలానే దోస్తీ సాంగ్ తో పాటు ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన నాటు నాటు సాంగ్ ఇలా అన్ని కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇవి యూట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూస్ మరియు లైక్స్ దక్కించుకోవడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అందరిలోనూ ఉన్న అంచనాలు మరింతగా పెరగడంతో ఎప్పటికప్పుడు సినిమాకి సంబంధించి ఒక్కో అప్ డేట్ ని యూనిట్ ఎంతో పక్కాగా ప్లాన్ ప్రకారం రిలీజ్ చేస్తూ వస్తోంది.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ నుండి తదుపరి సాంగ్ ని ఈనెల 25న విడుదల చేస్తారనే న్యూస్ ఎంతో వైరల్ అవుతోంది. ఆ సాంగ్ మంచి మెలోడీ స్టైల్ లో సాగుతుందని, అలానే సినిమాలోని కీలకమైన సీన్ దగ్గర వచ్చే ఆ పాట తరువాత మిగతా రెండు పాటలను కూడా వీలైనంత త్వరలో రిలీజ్ చేసి ఆపైన ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ యూనిట్ సన్నద్ధం అవుతోందట. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాని బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కించగా కీరవాణి సంగీతం అందించారు.

మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీసారని, ఇక ముఖ్యంగా ఈ సినిమాలో కొమరం భీం గా ఎన్టీఆర్, అలానే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించారని, ఇక జనవరి 7న ఎంతో భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో విడుదల కానున్న ఈ ఆర్ఆర్ఆర్ సినిమా తప్పకుండా అందరి అంచనాలు మించేలా గొప్ప విజయం సొంతం చేసుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. మరి రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: