ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా విడిపోయినా ఇరు రాష్ట్రాలలోని ప్రజలు మాత్రం ఫలానా సినిమా ఆంధ్రా సినిమా అని ఫలానా సినిమా తెలంగాణ సినిమా అని భేదభావం చూపెట్టకుండా సినిమా బాగుంటే ఆసినిమాలో నటించిన హీరోలు ఏప్రాంతం వారు అయినప్పటికీ సమానంగా చూస్తూ ఆ సినిమాలకు ఘన విజయాన్ని కట్టపెడుతున్నారు.


దీనితో తెలుగు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినప్పటికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మటుకు ప్రాంతాలకు అతీతంగా కొనసాగుతూనే ఉంది. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ఉన్న రోజులలో అప్పటి ప్రభుత్వాలు ఫిలిం ఇండస్ట్రీలో మంచి సినిమాలను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశ్యంతో నంది అవార్డ్స్ ఇస్తూ ఉండేవారు. ఈ అవార్డ్స్ కు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది.


అప్పుడప్పుడు కొన్ని వివాదాలు ఈ అవార్డ్స్ పై వచ్చినప్పటికీ నండీ పురస్కారాల గౌరవం ప్రవేట్ అవార్డ్స్ కు లేవు. ఈ నేపధ్యంలో ఈమధ్య జరిగిన ఒక ప్రవేట్ అవార్డ్స్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న చిరంజీవి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసాడు. ఒక కళాకారుడు కి డబ్బు ఎంత ముఖ్యమో గుర్తింపు అవార్డులు కూడ అంత ముఖ్యం అని చెపుతూ నండీ అవార్డ్స్ ను తిరిగి ప్రారంభించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేసాడు.


వాస్తవానికి చిరంజీవి విజ్ఞప్తిలో సరైన కారణం ఉన్నప్పటికీ తెల్లవారితే చాలు ప్రభుత్వాలకు ఎన్నికలు ప్రజా ఆకర్షణ పధకాలు మధ్య సమయం సరిపోక సతమతమైపోతున్న పరిస్థితులలో చిరంజీవి విజ్ఞప్తిని ఎంతవరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి అన్నది సమాధానం లేని ప్రశ్న. తెలుగు భాష ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పడానికి జరగవలసిన ప్రపంచ తెలుగు మహా సభల విషయం మరిచిపోయిన ప్రభుత్వాలకు నంది అవార్డ్స్ గుర్తుకు రావడం అంత సాధ్యం అయ్యే పని కాదు అని అనిపిస్తోంది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి మాటలలో ఉన్న ఆవేదన మాత్రం అందరు హర్షింప దగ్గ విషయం..



మరింత సమాచారం తెలుసుకోండి: