లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబునాయుడుకు జరిగిన ఘోర అవమానం పై తెలుగుదేశం వర్గాలు ఇప్పటికీ మండిపోతూనే ఉన్నాయి. ఈవిషయంలో నందమూరి కుటుంబ సభ్యులు అంతా ఏకమై చంద్రబాబుకు అదేవిధంగా ఆయన భార్య భువనేశ్వరికి బాసటగా నిలుస్తూ వారిద్దరికీ జరిగిన ఘోర అవమానాన్ని ఖండిస్తున్నారు.


ఈ పరిస్థితుల మధ్య జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో నందమూరి అభిమానులకు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వర్గాలకు అసహనాన్ని కల్గిస్తున్నట్లు మాటలు వినిపిస్తున్నాయి. దీనికికారణం చంద్రబాబుకు అదేవిధంగా భువనేశ్వరికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ జూనియర్ విడుదల చేసిన వీడియోలో స్త్రీల పై జరుగుతున్న అవమానాలను ఖండిస్తున్నాను అంటూ చెప్పాడు కానీ ఎక్కడా చంద్రబాబు భువనేశ్వరి పేర్లు చెప్పకపోవడంతో జూనియర్ విడుదల చేసిన ఆ వీడియో నీతి వాక్యాలు చెప్పే విధంగా ఉంది కానీ ఎక్కడా చంద్రబాబు కుటుంబానికి బాసటగా ఉండే విధంగా లేదనీ జూనియర్ అభిప్రాయం.



ఇప్పుడు ఇదే వీడియో పై వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కూడ విమర్శలు గుప్పిస్తున్నారు. జూనియర్ విడుదల చేసిన వీడియోలో చివరిన అరాచక పాలన అంతం కావాలి అంటూ చేసిన వ్యాఖ్యానాలకు అర్థం ఏమిటి అంటూ జూనియర్ ను నిలదీస్తున్నారు. ఇది ఇలా ఉండగా జూనియర్ భావయుక్తంగా చేసిన ఈ వీడియో ఇరు వర్గాలకు నచ్చకపోయినా అనవసరంగా ఈ వ్యవహారంలో జూనియర్ చేసిన కామెంట్స్ వల్ల ‘ఆర్ ఆర్ ఆర్’ టిక్కెట్ల రేట్ల పెంపుదల విషయానికి విఘాతం  కల్పిస్తుందని అని ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి.


ఇలా జూనియర్ చేసిన ఈకామెంట్స్ వీడియో ఎవరికీ నచ్చకపోవడంతో ఈ వ్యవహారంలో తెలివిగా జూనియర్ వ్యవహరించలేకపోయాడా అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా జూనియర్ ను రాజకీయాలలోకి రమ్మని తెలుగుదేశం పార్టీ వర్గాలు కోరుకుంటున్న సందర్భంలో లేటెస్ట్ గా జూనియర్ విడుదల చేసిన ఈ వీడియో తెలుగుదేశం వర్గాలకు కానీ అదేవిధంగా జూనియర్ సామాజిక వర్గ పెద్దలకు కూడ నచ్చలేదు అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: