నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత సమంత తన స్పీడ్ ను పెంచింది. వరసపెట్టి సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా తనకు ఎంతో పరిచయం ఉన్న తమిళ ఫిలిం ఇండస్ట్రీలో కూడ తన సత్తా చాటడానికి అనేక వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం తమిళ సినిమా పరిశ్రమలో తన పరిచయాలకు పదును పెడుతోంది.


ఇప్పుడు లేటెస్ట్ గా సమంత నయనతార ప్రియుడు ఆమెకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ ను తన వ్యూహాలకు సాధనంగా మార్చుకుని అతడి ద్వారా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోందా అంటూ కొందరు అంచనాలు వేస్తున్నారు. ఇలా అభిప్రాయాలు కలగడానికి లేటెస్ట్ గా జరిగిన నయనతార పుట్టినరోజునాడు ఆహ్వానం అందుకున్న అతి తక్కువ మంది సెలెబ్రెటీ లలో సమంత ఉన్నట్లు వార్తలు రావడం.


లేటెస్ట్ గా నయనతార ప్రియుడు ఆమెకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ నయనతార 39వ పుట్టినరోజును చాల ఘనంగా నిర్వహించాడట. అంతేకాదు ఆమె పుట్టినరోజునాడు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆమెకు తెలియకుండా పుట్టినరోజు పార్టీ ఏర్పాటు చేయడమే కాకుండా ఆరోజు దీపావళి లా విపరీతమైన బాణసంచా కూడ కాల్పించాడట. ఈ వేడుకలకు వచ్చిన సమంత నయనతార కు ఒక విలువైన బహుమతి కూడ ఇచ్చినట్లు సమాచారం.


అంతేకాదు వచ్చే పుట్టినరోజులోపు నయనతార విఘ్నేష్ శివన్ ల పెళ్ళి జరగాలని ఆ వేడుకకు వచ్చిన అతిధులు అంతా ఆకాంక్షించారట. అయితే నయనతార దృష్టి ఇప్పుడు బాలీవుడ్ పై పడింది. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ షారూఖ్ ఖాన్ తో తీయబోతున్న్ మూవీలో నయనతార హీరోయిన్ గా ఎంపిక కావడంతో వచ్చే ఏడాదికి అయినా నయన్ పెళ్ళి విఘ్నేష్ శివన్ తో పెళ్ళి అవుతుందా అంటూ కోలీవుడ్ మీడియా కామెంట్స్ విసురుతోంది. ఇప్పటికే సమంత దృష్టి బాలీవుడ్ పై కూడ పడిన పరిస్థుతులలో నయనతార ను ఆదర్శంగా చేసుకుని సమంత కూడ బాలీవుడ్ పై మరింత దృష్టి పెట్టే ఆస్కారం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: