ఓవర్ నైట్ స్టార్ అనే పేరుని అందరూ వినే ఉంటారు. ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు తామేంటో నిరూపించుకుంటాం అంటుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. అదృష్టం వరించినా అనుకున్న స్థాయిని చేరుకోలేక పోవచ్చు. మరి కొందరు కాలం కలిసి రావడంతో తమ పవర్ ఏంటో , తమ సత్తా ఏమిటో చాటుతున్నారు. మరికొందరు మాత్రం వారు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కెరియర్ ని నాశనం చేసుకుంటుంటారు. అలా ఓ రేంజ్ లో ఫేమ్ వచ్చిన కూడా కెరియర్ పరుగులు తీయించలేకపోయిన వారు చాలామందే ఉన్నారు. వారిలో షాలిని పాండే ఒకరు. పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే ఉంటుంది, అవునండి తానే అర్జున్ రెడ్డి హీరోయిన్.

సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రికార్డులు తిరగరాసిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ వేగం మామూలుగా లేదు. బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన ఈ చిత్రం విజయ్ దేవరకొండను ఒక్క దెబ్బతో క్రేజీ హీరోగా చేసేసింది. ఆ తర్వాత విజయ్ దేవర కొండ వరుస చిత్రాలతో, భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోయారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకి కూడా మంచి గుర్తింపే వచ్చింది. ఒక్క సినిమాతో తన లోని టాలెంట్ ను కనబరచి ఎమోషన్ యాంగిల్ లో ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది. ఇక ఆమె గ్లామర్ అయితే యువతను చూపు తిప్పుకోనివ్వలేదు. కాగా ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో ఆమె వేరే లెవల్ కి చేరుతుందని, క్రేజీ ఆఫర్స్ తో రాణిస్తుందని చాలామందే అనుకున్నారు.

కానీ విజయ్ దేవరకొండ విషయంలో ఈ మ్యాజిక్ జరిగింది కానీ, హీరోయిన్ షాలిని పాండే విషయంలో ఆ అంచనాలు తారుమారయ్యాయి. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఊహించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేక పోయింది. ఆ అవకాశాలు రాలేదో లేక వచ్చిన అవకాశాలను ఎంచుకోవడంలో మిస్ అయ్యారేమో తెలియదు. కానీ తెలుగులో పెద్దగా స్టార్ ఛాన్స్ లు దక్కించుకోలేకపోయారు. ఏదో కొన్ని ప్రత్యేక పాత్రలతో  సరిపెట్టుకున్నారు షాలిని. హిందీ, తమిళ, తెలుగు బాషల్లో వరుస గా నటిస్తున్నారు. కానీ మళ్ళీ తెలుగులో ఇంతవరకు అర్జున్ రెడ్డి రేంజ్ పాత్ర గుర్తింపు మాత్రం దక్కించుకోలేక పోయారు. మహానటి మూవీలో జానకిగా సావిత్రి గారి స్నేహితురాలి రోల్ లో కనిపించారు. ఎన్టీఆర్ కధానాయకుడు చిత్రంలో షావుకారు జానకి పాత్ర పోషించారు. నిశ్శబ్ధం , ఇద్దరి లోకం ఒకటే వంటి సినిమాలలో నటించారు కానీ అర్జున్ రెడ్డి మూవీ తరవాత అందరూ అనుకున్నంత ఫేమ్ అయితే తెలుగులో రాలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: