ఫరియా అబ్దుల్లా అనేకంటే చిట్టి అని పిలిస్తేనే అందరికీ తెలుస్తుంది ఆ అమ్మాయి. తన నవ్వుతో, ఆ అందంతో, హైట్ తో పాటు అభినయం కూడా కలగలిపి టాలీవుడ్ జాతిరత్నాల మనసులో స్థానం దక్కియించుకుంది చిట్టి. ఈ చిట్టి నవ్వుకు ఎంతమంది ఫిదా అయ్యారంటే లెక్క లేయలేమేమో !అనుదీప్ కెవి దర్శకత్వం వహించి నాగ అశ్విన్, స్వప్నా దత్ నిర్మించిన కామెడీ కేపర్ 'జాతి రత్నాలు'లో మహిళా ప్రధాన పాత్ర పోషించిన ఫరియా అబ్దుల్లా ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో అందరి దృష్టిలో పడింది. ఫారియా అబ్దుల్లా 28 మే 1998న హైదరాబాద్‌లో సంజయ్ అబ్దుల్లా, కౌసర్ సుల్తానా దంపతులకు జన్మించింది. ఆమె పాఠశాల విద్యను మెరిడియన్, భావనాస్ స్కూల్ హైదరాబాద్‌లో పూర్తి చేసేసింది. ప్రస్తుతం ఫరియా హైదరాబాద్‌లోని లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతోంది. మరోవైపు మోడలింగ్ చేస్తూనే నవీన్ పొలిశెట్టి సరసన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం 'జాతిరత్నాలు' ద్వారా ఫరియా టాలీవుడ్‌ లోకి అడుగు పెట్టింది. మొత్తానికి ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సునామీని సృష్టించిన చిట్టి ప్రస్తుతం ఎక్కువగా సినిమాల్లో కన్పించట్లేదు. కానీ అడపాదడపా అవకాశాలను పట్టేస్తుంది.

నాగ్ రాబోయే ఫాంటసీ డ్రామా బంగార్రాజులో కింగ్ నాగార్జునతో కాలు కదపడానికి సిద్ధంగా ఉంది. ఫరియా అబ్దుల్లా ఇప్పటికే ఈ చిత్రానికి సంతకం చేసిందని, త్వరలో ఆమె సెట్స్‌లో చేరి షూటింగ్ ప్రారంభించనుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. "బంగార్రాజు" చిత్రంలో నాగార్జునతో పాటు ఫరియా అబ్దుల్లా ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌లో అలరించనుంది. ఫరియా శిక్షణ పొందిన నృత్యకారిణి, ఆమె గ్లామర్‌తో పాటు ఆమె అనుభవం ఈ పాటకు పెద్ద అస్సెట్‌గా ఉంటుంది. నాగార్జునతో కలిసి నటించే అవకాశం రావడంతో ఫరియా చాలా ఉత్సాహంగా ఉంది. ఇక ఇటీవల ఈ బ్యూటీ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌"లో అతిధి పాత్రలో కనిపించింది. మరోవైపు శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న "ఢీ అండ్ ఢీ" అనే సినిమాలోనూ భాగం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: