Rx 100 మూవీ సృష్టించిన ప్రభజనం మాటల్లో చెప్పతరమా. టాలీవుడ్ లో చిన్న చిన్న చిత్రాలకు అలాగే వైవిధ్య భరితమైన కథాంశాలతో రూపుదిద్దుకున్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల విశేష ఆదరణ లభించిన దాఖలాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. హీరో, హీరోయిన్ల ఫేమ్ తో సంబందం లేకుండా కంటెంట్ ఉంటే చాలు ఇలా ఆ హీరో, హీరోయిన్ ల నటనా ప్రతిభ అందుకు తోడైతే ఇక తెలుగు ఆడియన్స్ వారికి బ్రహ్మరథం పడుతున్నారు. అటువంటి వాటిలో "rx 100" మూవీ కూడా ఒకటి. ఈ సినిమాతో ఒక్కసారిగా బిగ్ బిగ్ సెలబ్రిటీలు గా , స్టార్ హోదాను దక్కించుకున్నారు హీరో గా చేసిన కార్తికేయమరియు హీరోయిన్ గా చేసిన పాయల్ రాజ్ పుత్. వీరిద్దరికీ కూడా ఓ రేంజ్ లో స్టార్ డం పెరిగిపోయింది.

అలాగే ఈ చిత్ర  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడు అజయ్ భూపతికి కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.  జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలకు మించి రికార్డును సృష్టించింది. శివ పాత్ర కు ప్రాణం పోసిన కార్తీకేయ...చిత్రంలో చూపిన వేరియేషన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక పాయల్ ఈ మూవీకి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్లామర్ తోనే కాదు, అందమైన నటనతో ఆడియన్స్ ని కవ్వించే తన నటనతో అభిమానులుగా మార్చుకుంది. అలా టాలీవుడ్ కి ప్రతిభావంతులైన మరో ఇద్దరు హీరో, హీరోయిన్లు లభించారనే చెప్పాలి. సరైన పాత్రలను ఎంపిక చేసుకోవాలి కానీ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడానికి అవకాశం చాలానే ఉంది అని అంతా అనుకున్నారు.

ఇద్దరు కూడా వారి వారి కెరియర్ లో బిజీ అయ్యారు. ఆఫర్లు అందుకున్నారు.  కానీ rx 100 తర్వాత ఆ స్థాయి గుర్తింపును మాత్రం ఇప్పటి వరకు దక్కించుకోలేక పోయారు. దీనికి వారు ఎంచుకుంటున్న కథలే కారణమా లేదా కథలు బాగుంటున్నా సరిగా తెరకెక్కించలేని డైరెక్టర్ ల పొరపాటా? అన్నది వారే ఆలోచించుకోవాలి. కార్తికేయ అయితే వరుస పెట్టి సినిమాలు తీస్తున్నా హిట్ ను అందుకోలేక తడబడుతున్నాడు. అంతే కాకుండా RX  100 డైరెక్టర్ అజయ్ భూపతి సైతం మహాసముద్రంతో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. మళ్ళీ ఈ సూపర్ హిట్ కాంబో జత కలిసి హిట్ కొడతారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: