హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ అక్కినేని నాగ చైతన్య హీరో గా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా నిధి అగర్వాల్ అంద చందాలకు, నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత అక్కినేని అఖిల్ హీరో గా తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దు గుమ్మ కు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని తెచ్చి పెట్టలేదు.  అలాంటి సమయం లోనే రామ్ పోతినేని హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ కు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని తెచ్చి పెట్టింది.

ప్రస్తుతం నిధి అగర్వాల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే నిధి అగర్వాల్ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అంద చందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా నిధి అగర్వాల్ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో నిధి అగర్వాల్ బ్లాక్ కలర్  చెంకీల డ్రెస్ ను ధరించి తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం నిధి అగర్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: