ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ వెండితె అరంగేట్రం చేస్తోంది అయితే వారిలో అతి కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే తన అందం అభినయంతో ఆకట్టుకుంది అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ స్టేటస్ ని కైవసం చేసుకుంటున్నారు. మరోవైపు కేవలం ఒక్క సినిమాతోనే హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ ని దక్కించుకున్న హీరోయిన్లు కూడా మన టాలీవుడ్ లో ఉన్నారు. అందులో ఈ మధ్యే చూసుకుంటే ఉప్పెన సినిమాతో ఏకంగా ఓవర్నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. తన డెబ్యూ మూవీతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. 

బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఉప్పెన'. ఈ సినిమాతో వైష్ణవి తేజ్ కూడా వెండి తెరకు హీరోగా పరిచయమయ్యాడు ఇతను కూడా మన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కృతి శెట్టి తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందే కృతి శెట్టి అందానికి ప్రేక్షకులు దాసోహం అయిపోయారు. ఇక ఉప్పెన విడుదల తర్వాత ఆ సినిమాలో బేబమ్మ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి.. ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో దర్శక నిర్మాతలు కృతి శెట్టి వెంట పడటం మొదలు పెట్టారు.

 ప్రస్తుతం టాలీవుడ్ వరుస ఆఫర్లతో లో బిజీ బిజీగా మారిపోయింది. ఇది ఈ హీరోయిన్ ఇక ఉప్పెన తరువాత రెండో సినిమాగా నాని తో శ్యామ్ సింగరాయి సినిమాల్లో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఇక ఈ సినిమాతో పాటు ఉ సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నాగార్జున 'బంగార్రాజు' రామ్ సరసన మరో సినిమా ఇలా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది కృతి శెట్టి. అంతేకాదు ఒక్క సినిమాతోనే తన రెమ్యునరేషన్ను కూడా అమాంతం పెంచేసింది. ఉప్పెన సినిమాకి గాను కేవలం ఆరు లక్షల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్న హీరోయిన్ ..ప్రస్తుతం కోటి రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా చాలా తక్కువ సమయంలో అది కూడా ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన కృతి శెట్టి.ఇక ముందు ముందు ఇప్పుడున్న ఆగ్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: