హాట్ బ్యూటీ రాశి ఖన్నా, నాగ సూర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అంద చందాలకు, నటనకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో పాటు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అందులో భాగంగా సుప్రీమ్, వెంకి మామ, శ్రీనివాస కళ్యాణం, బెంగాల్ టైగర్, జోరు, జై లవకుశ, జిల్, హైపర్ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది.

ఇది అలా ఉంటే ప్రస్తుతం కూడా రాశి కన్నా థాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది, వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా రాశి కన్నా నటిస్తోంది. ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ ల తో ఫుల్ బిజీ గా ఉన్న రాశి కన్నా సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, తన మూవీ షూటింగ్ అప్డేట్స్ లను, తన డైలీ యాక్టివిటీస్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ హాట్ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది, తాజాగా కూడా రాశి కన్నా తనకు సంబంధించిన ఒక ఫోటో తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో రాశి కన్నా ఎరుపు రంగు దుస్తులను ధరించి, మెడలో ఒక లాకెట్ ను వేసుకొని, అదిరిపోయే లుక్ లో ఫోటో కు స్టిల్ ఇచ్చింది,  ప్రస్తుతం రాశి కన్నా కు సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: