టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సహకారంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నిషా అగర్వాల్ మొదటి చిత్రం "ఏమైంది ఈవేళ" సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాతోనే ఇటు నిషా అగర్వాల్ కి అలాగే అటు వరుణ్ సందేశ్ కి ఇరువురికి గొప్ప గుర్తింపు లభించింది. డెబ్యూ హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నిషా అగర్వాల్ తన అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది. అయితే తనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం సోలో అనే చెప్పాలి. ఈ సినిమాతో నిషా అగర్వాల్ కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది.

అంచనాలకు మించిన ఇంపాక్ట్ చూపించిన ఈ సినిమా హీరోయిన్ గా చేసిన నిషా అగర్వాల్ కి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. వరుసగా మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ అనుకున్న స్థాయికి మాత్రం చేరుకోలేక పోయారు. సినిమాలను ఎంచుకునే విషయంలో చేసిన పొరపాట్లు తనని ఇండస్ట్రీకి దూరం చేశాయని వార్తలు వినిపిస్తుంటాయి. అంటే కాజల్ అగర్వాల్ లాగా నిషా అగర్వాల్ కూడా టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ స్థాయికి చేరుకుంటారు అని అనుకున్నారు. కానీ కొన్ని చిత్రాల తర్వాత ఈ అందాల తార కెమెరాకి దూరమయి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటారు నిషా అగర్వాల్. అప్పుడప్పుడు అక్క కాజల్ అగర్వాల్ తో కనిపిస్తూ సందడి చేస్తుంటారు ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య కాలంలో ఈమె మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ అలా ఏమి జరగలేదు. అందుకే వచ్చిన కొద్దీ అవకాశాలను సరిగా వాడుకుంటేనే ఇక్కడ నిలదొక్కుకోగలరు.  

మరింత సమాచారం తెలుసుకోండి: