దర్శక ధీరుడు ..అపజయ మెరుగని వీరుడు..బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగు తెరకు అందించిన ఘనుడు రాజమౌళి. ఈ జక్కన్న గురించి ఎంత చెప్పిన అది ఆయన టాలెంట్ ముందు తక్కువగానే అనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాను ఇద్దరు బడా హీరోలతో తెరకెక్కించి..అసలు సాధమే కాదు అనుకున్న చరణ్, ఎన్టీఆర్ చేత మల్టీ స్టారర్ మూవీ తీయ్యించాడు. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 7వతేదీన విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న..రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్న క్రమంలో ప్రమోషన్స్ ని ఇంకా స్పీడ్ అప్ చేసారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించడానికి రాజమౌళి నే నేరుగా సల్మాన్ ఇంటికి వెళ్లడం గమనార్హం. 

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు  ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి రిలీజ్ అయిన అన్నీ పాటలు, ఫస్ట్ లుక్స్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. కానీ అన్నింటికన్నా రీసెంట్ గా రిలీజ్ అయిన నాటు నాటు పాట యూట్యూబ్ లో దుమ్ము రేపుతుంది, ఫుల్ మాస్ బీట్ తో వచ్చే ఈ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ దుమ్ములేచిపోయేలా డ్యాన్స్ చేసారు. ఊర మాస్ స్టెప్పులతో ఇరగదీసారు. ఇక ఈ పాట ఎంత్ సెన్సేషన్ గా మారిందంటే.. సొషల్ మీడియాలో ఈ పాటకు బోలెడు కవర్ సాంగ్స్ కూడా చేసారు. అంతలా అందరిని ఆకర్షించింది ఈ పాట.

అయితే తాజాగా  కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటకు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఓ కొత్త వీడియోని వదిలారు. నాటు నాటు పాటని పునీత్ రాజ్ కుమార్ డ్యాన్సులతో రీక్రియేషన్ చేసి కన్నడ వెర్షన్ మాషప్ రూపొందించారు. ఈ వీడియో చూసిన  నెటిజన్స్  తెగ సంబర పడుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే..ఈ వీడియోకి ఆర్ఆర్ఆర్ టీం కూడా స్పందించ‌డం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: