బిగ్ బాస్ ప్రియా వెండితెరపై పలు సినిమాలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ఆ తరువాత బుల్లితెరపై కూడా ఎన్నో ధారావాహికలలో నటించి ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో తన అందచందాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అంతేకాదు బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్, టాస్క్ లతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది.. అంతేకాదు కెప్టెన్సీ కాలేరని తెలిసినప్పటికీ ఈమె చిరునవ్వుతో తన నిర్ణయాన్ని స్వీకరించి, ఎంతోమంది ప్రేక్షకుల మనసులను సంపాదించుకుంది.కానీ  ఎట్టకేలకు అసాధ్యం అనుకున్న కెప్టెన్సీని సుసాధ్యం చేసి ఐదవ వారంలో కెప్టెన్ గా నిలిచింది ప్రియ.. కానీ ఏమైందో తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లో సన్ని రెచ్చగొట్టడం.. కోపంతో తట్టుకోలేక చెంప పగలగొడతా అని చెప్పడంతో ఆమెపై నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేశారు.. అందుకే ఆమెకు ఓట్లు తగ్గి ఏడవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.. తాజాగా ఈమె ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్ లంతా హాజరయ్యారు..

నవంబర్ 21వ తారీకు న ప్రియా కు వరుసకు కూతురు అయ్యే లోహిత పెళ్లి జరిగింది. ఇక ప్రియా స్వయంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లో అందరినీ పెళ్లికి పిలిచింది.. వీరిలో జెస్సి, ఉమాదేవి, సరయు ,శ్వేత ఇలా పలువురు హాజరయ్యి పెళ్లి లో సందడి చేశారు. అంతేకాదు ఆ పెళ్లి వేడుకలలో వీరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 మొన్నామధ్య ప్రియా ఇంటి ముందు ముగ్గు వేస్తూ మా ఇంట్లో పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి అంటూ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆ పెళ్లి కాస్త పూర్తయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: