మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో విశేష స్పందన రాబట్టింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని డిసెంబర్ 3న విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్.కానీ బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ' సినిమా డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం తో వరుణ్ తేజ్ తన సినిమాను డిసెంబర్ 24 కి వాయిదా వేసుకున్నాడు.

కానీ అప్పటికే నాని నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ్' కూడా డిసెంబర్ 24 కే విడుదల అవుతుందని ప్రకటించారు. దీంతో రెండు సినిమాల దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాని శ్యామ్ సింగరాయ్ ఆ సినిమాను వాయిదా వేసుకోమని గని సినిమా నిర్మాతలు అడిగారు. కానీ శ్యామ్ సింగరాయ్ టీమ్ దానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప విడుదలైన మరో వారంలోనే మరో మెగా హీరో సినిమా రావడం నిర్మాత అల్లు అరవింద్ కి ఇష్టం లేదట. దీంతో వరుణ్ తేజ్ గని సినిమాని వాయిదా వేయడానికి నిర్ణయించారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల్లో ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

 కుదిరితే డిసెంబర్ 10న లేకపోతే డిసెంబర్ 31న సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట నిర్మాతలు. ఇక అప్పుడు కూడా రిలీజ్ అవ్వకపోతే రిపబ్లిక్ డే కి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అల్లు అరవింద్ కొడుకు అల్లు బాబీ నిర్మాతగా మారుతున్నాడు. ఇక సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తోపాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇక యువ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: