సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు ఎన్నో కథలను వింటూ ఉంటారు..అయితే వారు విన్న కథలు అన్నిటికీ ఓకే చెప్పాలి అన్న రూలేమీ లేదు.. ఇకపోతే స్టార్ హీరో రిజెక్ట్ చేసిన సినిమాలను మరో స్టార్ హీరో మాత్రమే చేస్తారు అన్న నియమ నిబంధనలు కూడా లేవు. ఏకంగా మోహన్ బాబు, రాజశేఖర్ వంటి బడా హీరోలు రిజెక్ట్ చేసిన ఒక కథను లేడీ అమితాబ్ విజయశాంతి లీడ్ రోల్ పోషించి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. ఆ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..


1986 వ సంవత్సరంలో విడుదలైన ప్రతిధ్వని చిత్రం విజయఢంకా మోగించింది.. ఇకపోతే శారదా ప్రధాన పాత్రలో డి.రామానాయుడు ఒక సినిమాను నిర్మించాలని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారు. ఇక వారు ప్రతిధ్వని వంటి పవర్ ఫుల్ కథను తయారు చేసి వినిపించడంతో ఆయన ఓకే చెప్పాడు. అలా శారదతో ప్రతిధ్వని చిత్రం తెరకెక్కి  సూపర్ హిట్ విజయం అందుకుంది. అది గమనించిన విజయశాంతి పర్సనల్ మేకప్ మెన్.. సూర్య మూవీస్ అధినేత అయిన ఎ.ఎం.రత్నం.. మా మేడం కి కూడా ఇలాంటి పవర్ఫుల్ పాత్ర తో కూడిన ఒక కథ తయారు చేయమని పరుచూరి బ్రదర్స్ ను అడిగితే వాళ్ళు తర్వాత చూద్దాం అని చెప్పారట.

ఇక 1989 లో విజయశాంతి కోసం  పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవిత కథ ను ఆదర్శంగా చేసుకొని ఒక కథ తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక పేరు తెచ్చుకున్న కానిస్టేబుల్ జీవితం ఆధారంగా వినోద్ కుమార్ పాత్రను సృష్టించి తెరకెక్కించడం జరిగింది. ఇకపోతే రాజశేఖర్, మోహన్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరో లను ఈ పాత్ర కోసం అడిగితే వారు తిరస్కరించాడట. ఇక విలన్ గా పరుచూరి గోపాలకృష్ణ ను అనుకుంటే ఆయన కూడా నిరాకరించారు. ఇక తరువాత పుండరీకాక్షయ్య ఈ సినిమాలో విలన్ గా కనిపించి కర్తవ్యం సినిమాకు ప్రాణం పోశారు. అలా ఆ స్టార్ హీరోలు వద్దనడంతో ఈ స్టార్ హీరోయిన్సినిమా చేసి ఒక సంచలనం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: