ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు డాన్స్ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్. ఎందరో స్టార్ కొరియోగ్రాఫర్ లతో కలసి వర్క్ చేశారు. అలాగే సొంతంగా ఎన్నో పాటలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు ఆనీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే అవకాశం లభించడంతో తన అభిమానులు అంతా ఎంతో సంతోషపడ్డారు. హౌజ్ లోకి అడుగు పెట్టిన ఈమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలా బిగ్ బాస్ హౌస్ లో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన ఆనీ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఆటలోనూ మగవారికి ధీటుగా ఆడుతూ టైటిల్ పోరులో ఒకరిగా నిలిచింది.

అయితే అనూహ్యంగా గత వారం జరిగిన ఎలిమినేషన్ లో అందరి కంటే తక్కువ ఓటింగ్ ను తెచ్చుకుని హౌస్ నుండి రాత్రి బయటకు వచ్చేసింది. దాదాపు 11 వారాలుగా ఆనీ మాస్టర్ కు సపోర్ట్ గా ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతో బాధపడ్డారు. ఇలా హౌస్ నుండి బయటకు వచ్చిందో లేదో అప్పుడే ఈమెకు మెగా ఫ్యామిలీ నుండి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోనూ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె వివాహానికి ఆనీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల ముందు రామ్ చరణ్ తేజ్ చెప్పిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి గెస్ట్ గా విచ్చేసిన రామ్ చరణ్ తేజ్...కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ అనీ మాస్టర్ ను చూసి మిమ్మల్ని ఎలా మర్చిపోతాం మాస్టర్ మీరు మా సిస్టర్ మ్యారేజ్ కి కొరియోగ్రఫీ చేశారు కదా అని అన్నారు.

అయితే ఇపుడు ఆనీ మాస్టర్ కి మరోసారి మెగా కాంపౌండ్ నుండి కొరియోగ్రఫీ చేసేందుకు పిలుపు వచ్చినట్లు సమాచారం. అయితే అది సినిమా కోసమా లేక ఏదైనా కుటుంబం లోని ఫంక్షన్ కోసమా అన్న వివరాలు తెలియదు. మరి ఈ వార్త గురించి ఓ క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: