కొంత మంది హీరోయిన్ లకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అంటే వారికి నటన అందం అన్ని కలిసి ఉన్న కూడా రానీ అదృష్టం సినిమా హిట్టయి తే ఆటోమేటిక్ గా అవన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ విధంగా హీరోయిన్ రష్మిక మందన నటన పరంగా గ్లామర్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆలచిస్తూ ఇప్పుడు దూసుకుపోతుంది. ఆమె నటించిన తొలి చిత్రం ఛలో సూపర్ హిట్ కావడంతో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు.

దానికి ముందు కన్నడ పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఉన్న ఆమె తొలి సినిమాతోనే ప్రేక్షకులను చూపు తిప్పు  కొనివ్వ కుండా చేసింది. ఆ తర్వాత ఆమె నటించిన రెండవ చిత్రం గీత గోవిందం కూడా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఆమె కెరీర్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఏకంగా మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని అందుకొని ఆ చిత్రాన్ని కూడా సూపర్ హిట్ చేసుకుంది రష్మిక.

అలా ఒక్కసారిగా యువతకు గ్లామర్ ఐకాన్ గా మారిన రస్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో మరిన్ని సినిమాలతో బిజీగా ఉంది. కన్నడ పరిశ్రమ నుంచి టాలీవుడ్ కి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళి న ఈమె అక్కడ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే పుష్ప సినిమా లో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కొంత మంది యంగ్ హీరోల సరసన కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రలు తన కు తప్పకుండా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాయని ఆమె భావిస్తుంది. తమిళ సినిమా పరిశ్రమలో కూడా ఆమె కొన్ని సినిమాలు చేస్తోం ది.

మరింత సమాచారం తెలుసుకోండి: