మెగాస్టార్ చిరంజీవి అంటే ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నాలుగు పదులు దాటిన నటనా ప్రస్థానం. ఈ రోజుకీ కూడా యువకుడిగా వెండితెర మీద ఆయన చేసే విన్యాసాలు అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. మెగాస్టార్ చిరంజీవి వయసు ఆరున్నర పదులు దాటింది.

అయితే అదంతానంబర్ గేమ్  గానూ  టెక్నికల్ గానే చూడాలి. ఆయన మనసుకు కానీ శరీరానికి కానీ ఆ ఏజ్ లేదు. ఏజ్ లేస్ హీరోగా చిరంజీవి టాలీవుడ్ ని శాసిస్తున్నాడు. మెగాస్టార్ సైరా మూవీ తరువాత కొత్త సినిమా ఏదీ చేయలేదు అంటారు. ఇక సైరా రిలీజ్ అయింది 2019 అక్టోబర్ దసరాకు. ఈ రోజుకు చూస్తే రెండేళ్లు దాటింది.

అయితే చిరంజీవి ఆ లోటుని తీర్చడానికి రెట్టింపు ఆనందాన్ని ఇవ్వడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. 2022లో ఏకంగా మూడు సినిమాలు చిరంజీవివి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఆచార్య ఫిబ్రవరిలో వస్తే ఆ తరువాత గాడ్ ఫాదర్, భోళా శంకర్ వస్తాయని టాక్. ఇక వాల్తేరు శ్రీను అయితే 2023  సంక్రాంతికి రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే ఇక్కడికి 4 సినిమాలు అన్న మాట.

ఆ తరువాత చూస్తే మరో మూడు సినిమాలు కూడా లైన్ లో పెట్టారుట మెగాస్టార్. అవేంటి అంటే యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద డైరెక్టర్ మారుతితో మూవీ ఉందని టాక్. ఆ తరువాత భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా మెగాస్టార్ కాంబోలో ఒక మూవీ అంటున్నారు. దీని మీద ఆల్ రెడీ స్టోరీ మెగాస్టార్ విన్నారని ఒకే చేశారని తెలుస్తోంది. ఇక దీని తరువాత  నిర్మాత విష్ణు ఇందూరి తీసే సినిమాకు కూడా చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. టోటల్ గా చూస్తే ఏడు సినిమాలు, ప్రతీ ఏడాది మూడుకి తగ్గకుండా రిలీజులు, వామ్మో మెగాస్టారా మజాకానా..





మరింత సమాచారం తెలుసుకోండి: