టాలీవుడ్ లో వరుస సక్సెస్ ను అందుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ప్రస్తుతం ఎఫ్3 సినిమాని తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి మాట్లాడుతూ.." బాలకృష్ణ గారితో నేను చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఎక్కువగా ఉంటుంది. అయితే సినిమా మొత్తం పూర్తి ఎంటర్టైన్మెంట్ కాకుండా సీరియస్ డ్రామా కూడా ఉంటుంది.

 ఇక సినిమాలో బాలకృష్ణ గారిని కొత్త తరహాలో చూపించబోతున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ చేస్తున్నాం. ఇక వచ్చే ఏడాది జూలై నుంచి బాలయ్యతో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది" అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. దీంతో వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే టాలీవుడ్లో తనదైన మార్క్ కామెడీ డైలాగ్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ను పంచుతూ వరుస విజయాలు అందుకుంటూ వెళ్లిపోతున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది.అటు బాలయ్య కూడా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడని ఆశిస్తున్నారు అభిమానులు.

 ఈ నేపథ్యంలోనే వీరి కాంబోలో ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్  3 సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైన వెంటనే సినిమా బాలయ్యతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక బాలయ్య అనిల్ రావిపూడి కాంబో లో రాబోతున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: