ఒక సినిమా నటీనటుల జీవితాన్నే మార్చేస్తుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ని తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి యాక్టర్స లో హీరోయిన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. కానీ మొదటి సినిమాతోనే స్టార్ స్టేటస్ ని పొందే హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో ఇలియాన ఒకరని చెప్పవచ్చు. 2006వ సంవత్సరంలో విడుదలైన ఒక సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమై హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన నటి ఇలియానా.
తెలుగు సినీ పరిశ్రమలో 2006 సంవత్సరంలో వైవియస్ చౌదరి దర్శకత్వంలో  రామ్ మరియు ఇలియానా జంటగా నటించిన చిత్రం దేవదాసు. ఈ సినిమా ఆ సమయంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ద్వారా రామ్ కూడా  తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. రామ్ పోతినేని కూడా హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇది.  ఇలియానా నటన, అందంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకర్షించింది. లవ్ స్టోరీ బ్యాక్ గ్రౌండ్ తో తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు సన్నివేశాలు అప్పట్లో అభిమానుల ఎంతగానో ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఇలియానా నవంబర్ 1  1987లో ముంబయిలో జన్మించారు.


హీరోయిన్గా రాకముందు వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈ సినిమా ఆ రోజుల్లో థియేటర్లో 175 డేస్ ఆడింది. ఈ సినిమాలో ఇలియానా గ్లామర్, పర్సనాలిటీ చూసి చాలామంది అభిమానులుగా మారారు. దాంతో దర్శక నిర్మాతలు ఆమె వెంట పడటం  మొదలుపెట్టారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు పాటలు అప్పట్లో జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఈ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత అదే సంవత్సరంలో  పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ప్రిన్స్ మహేష్ బాబు, ఇలియానా జంటగా వచ్చిన మూవీ పోకిరి. అది కూడా ఇండస్ట్రీ హిట్ అవడంతో ఇలియానా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా గుర్తింపు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: