కొన్నిసార్లు ఒక్క సినిమా హిట్ హీరో ని సూపర్ స్టార్ చేస్తుంది , హీరోయిన్ ని స్టార్ హీరోయిన్ ని చేస్తుంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన అందరికి జరగకపోయిన కూడా జరిగిన కొంతమంది మాత్రం స్టార్ హీరోయిన్స్ అయిపోతారు. అలా మొదటి సినిమా ప్లాప్ అయిన కూడా రెండో సినిమాతో సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ అయిన హీరోయిన్ కాజల్. ఆమె కెరిర్ ని మార్చేసిన సినిమా కృష్ణవంశీ తీసిన చందమామ. డైరెక్టర్ కృష్ణవంశీ అంటే ఫామిలీ సినిమాలకి పెట్టింది పేరు. నిన్నే పెళ్లాడతా , మురారి లాంటి సినిమాలు దీనికి ఉదాహరణ. ఆయన చాలా స్ట్రాంగ్ అయిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమాతో వచ్చి కృష్ణవంశీ నిజంగా మాయ చేసాడు.

ఈ సినిమాలో కాజల్ అందం అభినయం అసలు సూపర్ అని చెప్పాలి. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఆమె అల్లరితనం , అమాయకత్వమే కారణం అని చెప్పొచ్చు. ఈ సినిమా ఆమె కెరిర్ లో బెస్ట్ యాక్టింగ్ చేసిన చిత్రాల్లో ఒకటిగా ఉంటుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకి మెగా అవకాశం మగధీర వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కానీ చందమామ అంటే కాజల్ అభిమానులు ఇప్పటికి గుండెలో పెట్టుకుంటారు. దీని తర్వాత కాజల్ , కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమా ఒక మోస్తరు గా ఆడింది.

 కానీ ఆ సినిమాలో కూడా కాజల్ సూపర్ క్యూట్ అని చెప్పొచ్చు. ఇక ఈ మద్యనే పెళ్లి అయిన కూడా ఆమెకి ఇంకా క్రేజ్ తగ్గకపోవడానికి రీసన్ కూడా ఆమె మొదట్లో చేసిన సినిమాలే. ఇంకో 20 సినిమాలు చేసిన కూడా కాజల్ చందమామ లో చేసిన పాత్ర టాప్ లోనే ఉంటుంది. హీరోయిన్స్ ని మామూలుగానే అందంగా చూపించే కృష్ణవంశీ ఈ సినిమాలో కాజల్ ని ఇంకాస్త అందంగా చూపించి మెప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: