తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు వచ్చే కొద్దీ ఎంతో రసవత్తరంగా మారుతోంది. వారాలు గడుస్తున్నకొద్దీ ఇంట్లో నుంచి హౌస్ మేట్స్ ఎలిమినేట్ అవుతూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 11 వారానికి గాను మరో కంటెస్టెంట్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ అని మాస్టర్ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. గత 11 వారాలుగా హౌస్లో కొనసాగిన అనీ మాస్టర్ మిగతా సభ్యులతో సరదాగా ఉండడంతోపాటు టాస్క్ లలో అందరికీ గట్టి పోటీ ఇచ్చారు. తన ఆటతీరుతో ఒకానొక సందర్భంలో అనీ మాస్టర్ టాప్5 లో కూడా నిలుస్తుందని అనుకున్నారంతా.

 అయితే అనూహ్యంగా 11వ వారానికి గాను ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఎప్పటిలాగే అని మాస్టర్ హౌస్ నుండి బయటకు రాగానే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అదే బిగ్ బాస్ హౌస్ లో అని మాస్టర్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి. హౌస్ లో 11 వారాలు ఉన్న అని మాస్టర్ కి బిగ్ బాస్ భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ సెలబ్రిటీ హోదాను అందుకున్న అని మాస్టర్ కి బిగ్ బాస్ వారానికి ఏకంగా మూడు లక్షల రెమ్యూనరేషన్ ను ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే సీజన్లో 11 వారాల గాను 30 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న ట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ వార్తలో ఎంత వరకూ వాస్తవం ఉందో ఆమెకే తెలియాలి. మరోవైపు ఎలిమినేషన్ తర్వాత అనీ మాస్టర్ హౌస్ లో మరో కంటెస్టెంట్ ను బయటకు పంపించే క్రమంలో ఇంట్లో నామినేషన్ ప్రక్రియ చాలా హిట్ పుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రోమో లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్స్  మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచినట్లుగా తెలుస్తోంది. మరి ఈ వారం నామినేషన్ ప్రక్రియ లో ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: