పాపం అఖిల్ అక్కినేనికి ఇంకా సాలిడ్ హిట్ రాలేదని తెలుస్తుంది.కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ ఓ ఏవరేజ్ హిట్ వచ్చిందని తెలుస్తుంది.

కాకపోతే థియేటర్స్ నుంచి ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదని సమాచారం.దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడని తెలుస్తుంది.కానీ తాజాగా ఈ సినిమాకి వచ్చిన ఓ రికార్డ్ కారణంగా అఖిల్ మనసు ప్రస్తుతం కుదుట పడిందని తెలుస్తుంది.

ఇంతకీ అఖిల్ సినిమాకి దక్కిన క్రెడిట్ ఏమిటంటే.. రెండు రోజుల క్రితం ఈ చిత్రం ఆహా యాప్ లో విడుదలైందని సమాచారం.సినిమా పెట్టిన రెండు గంటల వరకు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదట కానీ ఒక్కసారిగా ప్రేక్షకులు బ్యాచిలర్ పై పడ్డారట.. దాంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ ను సాధించి ఒక రికార్డ్ ను సృష్టించుకుందని సమాచారం.

నిజంగానే అఖిల్ సినిమాకి ఇలాంటి ఒక రికార్డు నమోదు అవుతుందని ఎవరూ ఊహించలేదని సమాచారం.. ఎందుకంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కి థియేటర్స్ లో పెద్ద విజయం దక్కలేదని తెలుస్తుంది.కొన్ని ఏరియాల్లో అయితే ఓపెనింగ్ రోజే జనం లేరని సమాచారం.. అలాంటి సినిమాకు రెండు రోజుల్లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అంటే గ్రేట్ అని చెప్పవచ్చు.మొత్తమ్మీద అఖిల్ సినిమా ఓటిటిలో బ్లాక్ బస్టర్ హిట్ అయిందని తెలుస్తుంది.

తన సినిమా ఈ రేంజ్ హిట్ సాధించడంతో అఖిల్ టీమ్ కు ఫుల్ హ్యాపీగా ఉందని సమాచారం. మొత్తానికి తనకు దక్కిన ఈ విజయం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అని అఖిల్ బాబు తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని తెగ సంతోషపడుతున్నాడని సమాచారం.. సాధించిన విజయం చిన్నది అయినా కూడా రాక రాక వచ్చిన విజయం కనుక అఖిల్ లో ఈ స్థాయి హుషారు ఉండటంలో ఆశ్చర్యం లేదని సమాచారం..

ఇక ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రం ద్వారా అఖిల్ తన తొలి ఏవరేజ్ హిట్ ను అందుకున్నాడని అందరికి తెలిసిందే . అలాగే ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిందని సమాచారం.. అన్నట్టు ఈ ఏవరేజ్ హిట్ తో బొమ్మరిల్లు భాస్కర్ మరో చిత్రాన్ని పట్టుకున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: