స్టార్ హీరో బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కానుందని అందరికి తెలిసిన విషయమే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయని తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని సమాచారం.. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ నటిస్తున్నారని తెలుస్తుంది.

అఖండ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం . సెన్సార్ సభ్యుల నుంచి అఖండ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది సినిమాలో అఘోరా పాత్ర ఎంట్రీ ఇంటర్వల్ తర్వాత ఉంటుందని బాలయ్య స్టైల్ సినిమాకు హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది.. సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ మరియు క్లైమాక్స్ ఫైట్ అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారట . పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. విలన్ గా శ్రీకాంత్ మేకోవర్ బాగుందని అఖండ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉందని చెప్పుకొచ్చారట.

 

అఖండ సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉండటంతో బాలయ్య అభిమానులు సంతోషిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి మరి. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉందని తెలుస్తుంది.ఈ సినిమాలో బాలయ్యలో నటనా విశ్వరూపం చూడవచ్చట. బోయపాటి అంటేనే మాములుగా ఉండదని అందరికి తెలుసు. మరి బాలయ్య బోయపాటి కలిస్తే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.మరి చూడాలి బాలయ్య వారు ఏ విధంగా ఆకట్టుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: