బుల్లితెరపై ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా కొనసాగుతుంది. ఈ షో 11వారలు పూర్తి చేసుకొని 12వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక 12వ వారం ఎలిమినేషన్లో ఒక్క మానస్ తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరు ఉన్నారు. అయితే ఈ వారం ప్రియాంక బయటకు వెళ్తున్నారనే టాక్ వినపడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా.. గతవారం ఇంటి నుంచి యానీ మాస్టార్ బయటకు వచ్చిన సంగతి అందరికి తెల్సిందే. మాస్టర్ దాదాపు టాప్ 5 లో ఉంటారని చాలా మంది అనుకున్నారు.

కానీ.. అనుకోని విధంగా యానీ మాస్టార్ గతవారం ఇంటి నుండి బయటకి వచ్చారు. అయితే 11 వారాలకు గాను అనీ మాస్టర్‌కు ఎంత రెమ్యునరేషన్ వచ్చిందో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యానీ మాస్టార్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ముందే ఇండస్ట్రీలో సెలెబ్రెటీగా రాణిస్తున్నారు. ఆ తరుణంలోనే మాస్టర్ ను బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకునే ముందే వారానికి రూ.3 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ఒప్పొందం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే యానీ మాస్టర్ మొత్తం 11 వారాలకు రూ.33 లక్షల వరకు ఆమె అందుకున్నారని సమాచారం. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. యానీ మాస్టార్ కంటే ముందు జెస్సీ ఇంటి నుంచి బయటకు వచ్చిన సంగతి అందరికి తెల్సిందే. జెస్సి అనారోగ్యం కారణంగా అతను అకస్మాత్తుగా ఇంటి నుండి బయటికి రావడంతో ఆ వారం డేంజర్ జోన్ లో ఉన్న మానస్ లేదా కాజల్ లో ఒకరిని సేవ్ చేస్తూ బయటికి వచ్చాడు. ఇక వారిద్దరిలో మానస్ స్ట్రాంగ్ ప్లేయర్. కానీ కాజల్ కి ఆలా కలిసి వచ్చి ఆ వారం ఆలా కలిసి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా యనీ మాస్టర్ ఎలిమినేట్ అవడం కాజల్‌కు కలసి వచ్చింది. ఈ సీజన్ లో టాప్ 5లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ చంద్ర, యాంకర్ రవి ఉంటారని కచ్చితంగా తెలుస్తోంది. ఇంకో కాంటెస్ట్ ఎవరో అనేది ఇంకా అంచనాకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: