జనవరి 7న విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ 14న విడుదల కాబోతున్న ‘రాథే శ్యామ్’ సినిమాలు రెండు పాన్ ఇండియా మూవీలు కావడంతో ఈమూవీలు హిట్ అనిపించుకోవాలి అంటే దేశవ్యాప్తంగా ఈ రెండు సినిమాలకు భారీ కలక్షన్స్ వచ్చి తీరాలి. అలా జరగాలి అంటే ఈ రెండు సినిమాల విడుదల మధ్య కనీసం రెండు వారాల గ్యాప్ ఉండి తీరాలి.


అయితే అలాంటి పరిస్థితి ఈ రెండు సినిమాలకు లేదు. కేవలం ఒక వారం గ్యాప్ లో ఈ రెండు సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతున్న పరిస్థితులలో కలక్షన్స్ పరంగా ఈ రెండు సినిమాలకు నష్టం కలిగే ఆస్కారం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల పరిస్థితి ఇంకా తెలియకుండానే ఈ రెండు సినిమాల పై దాడి చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.


ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ అక్షయ్ కుమార్ తో నిర్మించిన భారీ బడ్జెట్ చారిత్రాత్మక మూవీ ‘పృద్వీరాజ్’ జనవరి 21న విడుదల అవుతున్నట్లు ప్రకటన రావడంతో రాజమౌళి ప్రభాస్ సినిమాలకు బాలీవుడ్ లో కలక్షన్స్ గండం పొంచి ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి. 11వ శతాబ్దంలో రాజ్ పుట్ సామాజిక వర్గానికి చెందిన పృధ్వీరాజ్ చౌహాన్ అలనాటి విదేశీ ముస్లీం ల రాజ్య కాంక్ష పై తిరుగుబాటు చేసాడు. ఆయన వీరత్వం గురించి ఎన్నో కథలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. దీనితో పృధ్వీరాజ్ జీవితం పై అత్యంత భారీ స్థాయిలో తీసిన ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.


ప్రస్తుతం అక్షయ్ కుమార్ హవా బాలీవుడ్ లో నడుస్తోంది. ఈ పరిస్థితులలో ఈమూవీ సూపర్ హిట్ అయితే అప్పటికే విడుదలైన ‘అర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ లు విజయం సాధించినప్పటికీ వాటి కలక్షన్స్ పై అక్షయ్ కుమార్ ‘పృధ్వీరాజ్’ తీవ్ర ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో భారీ బడ్జెట్ తో తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ లాభాల బాట పట్టడం కష్టం అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: