నాగ చైతన్య.. ఈ మధ్య లవ్ స్టోరీ తో మంచి సక్సెస్ విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే ఆయన భార్య సమంతతో విడాకుల ప్రకటించిన తరువాత ఆయన పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి సారిస్తూ అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ఆయన ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నారు నాగచైతన్య. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు కూతురు లక్ష్మి దగ్గుబాటి ని.. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున వివాహమాడగా వీరిద్దరికీ 1986 నవంబర్ 23 వ తేదీన తెలంగాణలోని హైదరాబాదులో నాగ చైతన్య జన్మించాడు. అయితే నాగచైతన్య జన్మించిన నాలుగు సంవత్సరాలకి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక నాగచైతన్య కూడా సమంత తో విడాకులు తీసుకుని సినిమాలపై ఎక్కువ దృష్టి సారిస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నాడు.సినిమాల పరంగా మాత్రమే కాకుండా కొన్ని వాణిజ్య ప్రకటనలకు కూడా పనిచేసి రెండు చేతులా నాగచైతన్య బాగానే సంపాదిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక తన స్కూల్ విద్యాభ్యాసమంతా హైదరాబాదులో పూర్తి చేయగా, ఉన్నత విద్య అంతా లండన్ ట్రినిటీ కాలేజీలో పూర్తిచేశాడు. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు. 2009 వ సంవత్సరం లో కాజల్ సరసన జోష్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అంతేకాదు ఈ సినిమాతో బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఇక నాగచైతన్య ప్రస్తుతం తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి హైదరాబాద్ లోని నివసిస్తున్నాడు. ఇక అంతే కాదు వీరు గోవాలో ఒక ప్రత్యేకమైన అత్యంత ఖరీదైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.ఇక నాగచైతన్య దగ్గర ఉన్న కార్ల విషయానికి వస్తే ఫెరారీ 488 జీటీబీ.. దీని విలువ సుమారుగా 4.4 కోట్ల రూపాయలు. ఇక బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కారణం కూడా నాగచైతన్య సొంతం చేసుకున్నారు దీని ఖరీదు 1.36 కోట్ల రూపాయలు. నిస్సాన్ జీటీఆర్ అనే కార్ ను కూడా నాగచైతన్య కొనుగోలు చేశారు ఇక దీని ద్వారా రెండు కోట్ల రూపాయలు. పోర్స్చే పనామెర కారును కూడా కొనుగోలు చేశారు ఇక దీని విలువ 2.13 కోట్ల రూపాయలు. రేంజ్ రోవర్ ఓగ్ కార్ ధర 1.95 కోట్ల రూపాయలు. ఇక ప్రస్తుతం నాగచైతన్య ఒక్కో చిత్రానికి రూ.10 నుండి రూ. 12 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య దగ్గర నెట్ వర్త్ రూ. 161 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: