నాగార్జున హీరో గా రమ్యకృష్ణ హీరోయిన్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు, ఈ సినిమాలో నాగ చైతన్య కు జంటగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే బంగార్రాజు సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను, ఒక పాటను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా దీనికి కూడా జనాలు నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 ఇదిలా ఉంటే తాజా గా బంగార్రాజు సినిమా లో ముఖ్య పాత్రలో నటిస్తున్న నాగ చైతన్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య టోన్ జీన్స్, పూల షర్ట్ ను ధరించి చాలా స్టైలిష్ లుక్ లో  కనిపిస్తున్నాడు.  ప్రస్తుతం నాగ చైతన్య కు సంబంధించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట్లో వైరల్ గా మారుతుంది. ఇలా పోస్టర్స్, పాటలతోనే ఇప్పటికే జనాలలో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్ ను ఈరోజు ఉదయం 10:23 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది, దానికి ప్రధాన కారణం సోగ్గాడే చిన్నినాయన సినిమా కూడా సంక్రాంతి కానుక గా విడుద లై మంచి బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: