ఒకప్పుడు నానీ సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు నానీ సినిమాలకు సంబంధించి చాలామంది నిర్మాతలు కూడా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా దానికి అనుకూలంగా కథలు సిద్ధం చేసి ఆ కథలకు సంబంధించి చాలా శ్రద్ధ పెట్టి సినిమాని పూర్తి చేసే వాళ్ళు. ఇక నానీ కి ఉన్న క్రేజ్ ను కూడా చాలావరకు జాగ్రత్తగానే కొంతమంది నిర్మాతలు వాడుకున్నారు అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

నానీ ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండగా త్వరలోనే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం నానీ చేస్తున్న సినిమాలకు సంబంధించి అతని భార్య ఎక్కువగా దృష్టి పెడుతోందని సమాచారం. ఏ సినిమా కథ వచ్చిన సరే నానీ వెంటనే తన భార్యతో చర్చించిన తర్వాత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని గత నాలుగైదు సినిమాల విషయంలో తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు భార్యతో చర్చించిన తర్వాతే ముందుకు వెళుతున్నాడు అని సమాచారం.

ఇక ఈ సినిమాలకు సంబంధించి నానీ భార్య ఎక్కువగా దృష్టి పెట్టడమే కాకుండా నిర్మాతలతో దర్శకులతో మాట్లాడుతూ షూటింగ్ విషయంలో కూడా కాస్త శ్రద్ధ చూపిస్తున్నారని కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చే ప్రయత్నాలు కూడా చేస్తుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే నానీ భార్య ఇప్పుడు నానీసినిమాలకు సంబంధించి ఎక్కువగా శ్రద్ధ పెట్టడం తో నాని కూడా కాస్త సంతోషంగా ఉన్నాడు అని కథల ఎంపిక విషయంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా భవిష్యత్తులో చూసుకునే విధంగా నానీ భార్య ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. మరినానీఎంతవరకు ఈ విషయంలో సక్సెస్ అవుతాడు ఏంటి అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: