తెలుగు చిత్ర పరిశ్రమలో స్వీట్ కపుల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జంట సామ్- చై. వీరిద్దరికి ఏ మాయ చేసావే అనే సినిమాతో పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక వీరిద్దరూ పెళ్లితో ఒక్కటైయ్యారు. అయితే దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిన వివాహబంధానికి ఇటీవల వీరిద్దరు ముగింపు పలికిన విషయం అందరికి తెల్సిన విదితమే. వీరిద్దరూ విడాకులు ప్రకటించిన తర్వాత సమంత సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు పెడుతూ తన ఎమోషన్స్ ను తెలియజేసింది. కానీ.. చైతన్య మాత్రం ఆయన షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ని తప్ప ఆయన ఎక్కడ కనిపించలేదు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.. అంతేకాదు సుమారుగా 45 రోజుల పాటు విరామం తీసుకుని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో అది కాస్త వైరల్ గా మరీనా సంగతి అందరికి తెల్సిందే. నాగచైతన్య తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే ఇటీవల ఆయన చదివిన ఒక పుస్తకం తనను బాగా మార్చిందట.. ఆ పుస్తకం ఏదో కాదు హాలీవుడ్ నటుడు మాథ్యూ మాక నౌగే రాసిన గ్రీన్ లైట్స్ అనే పుస్తకాన్ని ఇటీవల నాగచైతన్య చదివినట్లు తెలుస్తోంది.

ఇక ఈ పుస్తకంలో ఉన్న కథ హాలీవుడ్ నటుడు మాథ్యూ మాక నౌగే యొక్క జీవిత చరిత్ర ఉంది. ఆ పుస్తకాన్ని చదివిన చైతన్య.. జీవితానికి ప్రేమలేఖ.. గ్రీన్ లైట్స్ అంటూ కామెంట్ పెడుతూ.. ఈ పుస్తకం యొక్క ముఖ చిత్రాన్ని కూడా ఆయన పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే. ఆయన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ కింద మీ ఆత్మ కథను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. అంతేకాక.. జీవితంలో ముందుకు వెళ్లడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ నాగచైతన్య తన పోస్ట్ లో తెలిపారు. అయితే ఈ పోస్టు చూసిన వారంతా సమంత గురించేనా అని అనుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: