తెలుగు సినిమాలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోల ఆదరణ పెరిగింది అని ప్రచారం కాస్త ఎక్కువగానే జరుగుతుంది. ఇక్కడ వసూళ్లు భారీగా పెంచుకోవడానికి కాస్త గట్టిగానే కష్టపడుతున్నారు బాలీవుడ్ హీరోలు అనే మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే కొంత మంది బాలీవుడ్ హీరోలు గత కొన్ని రోజుల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టడానికి కూడా తెలుగు సినిమా మీద దృష్టి పెట్టారని అలాగే మన తెలుగు లో ఉన్న కొంత మంది హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారని విలన్ పాత్రలు చేయడానికి కొంత మంది బాలీవుడ్ అగ్రహీరోలు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది.

బాలీవుడ్ హీరోలు కొంతమంది ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని పాత్రలు మన తెలుగులో చేయడానికి రెడీగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే తెలుగు హీరోలతో కూడా సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి.  అల వైకుంఠపురం సినిమా తో బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కాస్త క్రేజ్ పెంచుకున్నాడు అనే మాట వాస్తవం. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా ఒక సినిమాను చేయడానికి రెడీ అయ్యాడని దీనికి సంబంధించి అల్లు అరవింద్ కూడా సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని కొరటాల శివ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో అతను విలన్ పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు. కొరటాల శివ అక్షయ్ కుమార్ కు సంబంధించి కాస్త ఆసక్తికరంగా ఉన్నారని అయితే రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తే మాత్రం తాను చేయలేను అని చెప్పారని అంటున్నారు. మరి అక్షయ్ కుమార్ తెలుగులో నటిస్తారా లేదా అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: