కానీ ఈ వెబ్ సిరీస్ పై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఇందులో శ్వేతా వర్మ పోలీస్ రోల్ చేయబోతున్నారని హమీద, లహరి, సరయు లు ముఖ్య భూమిక లు పోషిస్తుండగా అనీ మాస్టర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మొదట ఈ వెబ్ సిరీస్ కు హమిదను మాత్రమే సెలెక్ట్ చేయగా...ఆ తరవాత అంతా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుండి ఎలిమినేట్ అయిన అనీ మాస్టర్, శ్వేతా వర్మ, లహరి, సరయు లు ఉంటే మరింత ఆసక్తికరంగా ఉంటుందని భావించి వీరిని ఎంపిక చేసినట్లు సమాచారం.
వీరైతే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి వెబ్ సిరీస్ బాగా క్లిక్ అవుతుందని భావిస్తున్నారట. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రారంభం అయ్యే లోపు ...ఒకవేళ సిరి కనుక హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తే ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ తనకే దక్కుతుందని చెబుతున్నారు. మరి ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఫుల్ డీటైల్స్ ఏమిటి...ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరి.